PM Modi: ‘ఆటలో ఇవి సహజం’.. టీమిండియా ప్లేయర్స్‌ను భుజం తట్టి ఓదార్చిన ప్రధాని..
అయితే వరల్డ్ కప్‌లో తొలి నుంచి అద్భుత ఆటతీరును కనబరిచిన ప్లేయర్స్‌కు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. కప్ గెలవకపోయినా అద్భుత ఆటతీరుతో క్రికెట్ లవర్స్ ప్రేమను గెలుచుకున్నారని ప్రజలంతా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీమిండియా ప్లేయర్స్‌కు మద్ధతుగా నిలిచారు. వారిలో ధైర్యాన్ని నింపుతూ, వారిని ప్రోత్సహించేలా...
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా ఓటమిని యావత్ దేశం జీర్ణించుకోలేకపోయింది. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ఆటతీరును కనబరించిన టీమిండియా ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి పోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. ఈసారి కప్ మనదే అనుకున్న వారి ఆశలు నిరాశలయ్యాయి.
అయితే వరల్డ్ కప్‌లో తొలి నుంచి అద్భుత ఆటతీరును కనబరిచిన ప్లేయర్స్‌కు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. కప్ గెలవకపోయినా అద్భుత ఆటతీరుతో క్రికెట్ లవర్స్ ప్రేమను గెలుచుకున్నారని ప్రజలంతా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీమిండియా ప్లేయర్స్‌కు మద్ధతుగా నిలిచారు. వారిలో ధైర్యాన్ని నింపుతూ, వారిని ప్రోత్సహించేలా ప్రధాని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ టీమిండియా ప్లేయర్స్ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ టీమిండియా సభ్యుల్ని ప్రధాని మోదీ ఓదార్చారు. ఆటగాళ్లను పేరుపేరునా పలకరించిన ప్రధాని.. ఆటల్లో ఇలాంటివి సహజమని భుజం తట్టి ఆత్మీయంగా మాట్లాడారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావంటూ బౌలర్ షమీని గుండెలకు హత్తుకున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ప్లేయర్లు అందరితో మాట్లాడారు. త్వరలోనే ఢిల్లీలో ప్లేయర్స్ అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా కూడా డ్రస్సింగ్ రూమ్‌కి వెళ్లి ప్లేయర్లతో మాట్లాడారు. ఫైనల్‌లో ఓడినా 10 మ్యాచ్‌లు గెలిచి అద్భుతంగా ఆడారని ప్లేయర్లను సముదాయించారు ప్రధాని.
ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 43 ఓవర్లలో 241 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆసీసీ కప్‌ను ఎగిరేసుకుపోయింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోహ్లీ 54, రాహుల్ 66, రోహిత్ 47 రన్స్ చేసినా కానీ.. లో స్కోర్ మ్యాచ్ కావడంతో ఆస్ట్రేలియాను కట్టడి చేయడం కష్టమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..