AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని వద్దన్నాడు.. రిషబ్‌ పంత్ కావాలన్నాడు.. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు టీ20 టైటిల్‌ గెలిచాడు..

Cricket News: UAEలో IPL 2021 సందడి మరికాసేపట్లో ప్రారంభంకానుంది. అయితే దానికి ముందు ఒక అద్భుతం జరిగింది. ధోనీ వదిలేసిన ఆటగాడిని పంత్ టీంలో చేర్చుకున్నాడు.

ధోని వద్దన్నాడు.. రిషబ్‌ పంత్ కావాలన్నాడు.. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు టీ20 టైటిల్‌ గెలిచాడు..
Cricket News
uppula Raju
|

Updated on: Sep 19, 2021 | 9:49 AM

Share

Cricket News: UAEలో IPL 2021 సందడి మరికాసేపట్లో ప్రారంభంకానుంది. అయితే దానికి ముందు ఒక అద్భుతం జరిగింది. ధోనీ వదిలేసిన ఆటగాడిని పంత్ టీంలో చేర్చుకున్నాడు. ఆ ఆటగాడు ఇప్పుడు టీ 20 టైటిల్‌ సాధించాడు. ఐపిఎల్ 2021లో పాల్గొనేముందు తన జట్టును టి 20 చాంఫియన్స్‌గా నిలిపాడు. అతను జట్టును బ్యాట్‌తో కాకుండా కెప్టెన్సీతో గెలిచాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ టి 20 టోర్నమెంట్ వైటాలిటీ బ్లాస్ట్‌ ఫైనల్. ఈ చివరి మ్యాచ్‌ కెంట్ వర్సెస్‌ సోమర్‌సెట్ మధ్య జరిగింది. ఇందులో కెంట్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెంట్ జట్టు కెప్టెన్ సామ్ బిల్లింగ్స్. అతను ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం. అతను ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడేవాడు. కానీ ఐపిఎల్‌ 2020లో ధోని అతడిని వదిలేశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని తీసుకుంది.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో కెంట్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెంట్‌ను ఈ స్థితికి తీసుకురావడంలో 20 ఏళ్ల బ్యాట్స్‌మన్ జోర్డాన్ కాక్స్ అతిపెద్ద పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 58 పరుగులు చేశాడు. కాక్స్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, అనేక ఫోర్లు ఉన్నాయి. కాక్స్ కంటే ముందు ఓపెన్ చేయడానికి వచ్చిన జాక్ క్రౌలీ 33 బంతుల్లో 41 పరుగులు చేశాడు. సోమర్‌సెట్‌లో వాన్ డెర్ మెర్వే అత్యంత విజయవంతమైన బౌలర్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్‌ 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆరంభంలోనే సోమర్‌సెట్ 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది కానీ అది విజయానికి సరిపోలేదు. జాన్ డెన్లీ 4 ఓవర్లలో 31 పరుగులకు 3 వికెట్లు తీశాడు. కెంట్ తరఫున అత్యత్తమ బౌలింగ్ చేశాడు. అతనితో పాటు కైస్ అహ్మద్ 2 వికెట్లు సాధించాడు.

Wedding: పెళ్లైన అరగంటకే ట్విస్ట్‌.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అదృశ్యమైన వధువు.. ఆ తర్వాత..

Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్