Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..

Man dumps 4 kids into water tank: ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య చనిపోవడంతో.. మరదలికిచ్చి పెళ్లి చేయలేదని నలుగురు కుమార్తెలను దారుణంగా చంపాడు. విషం ఇచ్చి

Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 19, 2021 | 6:24 AM

Man dumps 4 kids into water tank: ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య చనిపోవడంతో.. మరదలికిచ్చి పెళ్లి చేయలేదని నలుగురు కుమార్తెలను దారుణంగా చంపాడు. విషం ఇచ్చి వారందరినీ.. నీటి ట్యాంకులో పడేశాడు. మృతులందరూ పదేళ్లలోపు పిల్లలని పోలీసులు తెలిపారు. అనంతరం అతడు కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని బాడ్​మేర్‌లో జరిగింది. బాడ్‌మేర్‌ పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కరోనావైరస్‌ కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మరణించింది. కుమార్తెలకు తల్లి అవసరం ఉందని భావించిన పుర్ఖారామ్‌.. భార్య చెల్లిని (మరదలు) ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను, కుటుంబసభ్యులను కోరాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో పుర్ఖారామ్‌ శనివారం.. కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర) విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్‌లో పడేశాడు. తర్వాత పుర్ఖారామ్​కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే.. అతను ట్యాంక్‌లోకి దూకుతుండగా పొరుగింటివార గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఓం ప్రకాశ్‌ వెల్లడించారు.

ఈ ఘటనలో నలుగురు పిల్లలు కూడా మరణించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని చికిత్స అందుతుందని పేర్కొ్న్నారు. కాగా.. నిందితుడి వయస్సు 30 ఉంటుందని పోలీసులు తెలిపారు.

Also Read:

Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..

Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!