AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar: ఇషాన్ చేసిన డబుల్ సెంచరీపై మాజీల ప్రశంసలు..మాస్టర్ బ్లాస్టర్ ఏమన్నాడంటే..?

శనివారం బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యువఆటగాడు ఇషాన్ కిషన్ కేవలం 131 బంతుల్లోనే 10 సిక్సర్లు , 24 ఫోర్ల సాయంతో 210 పరుగులు సాధించాడు. తద్వారా భారత క్రికెట్‌ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన నాలగో ఆటగాడిగా..

Sachin Tendulkar: ఇషాన్ చేసిన డబుల్ సెంచరీపై మాజీల ప్రశంసలు..మాస్టర్ బ్లాస్టర్ ఏమన్నాడంటే..?
Ishan And Sachin
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 10, 2022 | 8:59 PM

Share

శనివారం బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యువఆటగాడు ఇషాన్ కిషన్ కేవలం 131 బంతుల్లోనే 10 సిక్సర్లు , 24 ఫోర్ల సాయంతో 210 పరుగులు సాధించాడు. తద్వారా భారత క్రికెట్‌ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన నాలగో ఆటగాడిగా ఇషాన్ రికార్డులకెక్కాడు. గతంలో డబుల్ సెంచరీ క్లబ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ , వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉండేవారు. అయితే శనివారం ఇషాన్ కూడా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగులు చేయడంతో అతను కూడా డబుల్ సెంచరీ క్లబ్‌లో చేరాడు.  ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఇషాన్‌ను అభినందించడమే కాక అతనితో కలిసి రెండో వికెట్‌కు 190 బంతులలో 290 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాక తన 44వ వన్డే సెంచరీని సాధించిన కోహ్లీని కూడా సచిన్ ప్రశంసించారు.

‘‘ఒక అద్భుతమైన నాక్! ఒక అద్భుతమైన నాక్! ఈరోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్ రెట్టింపు ప్రశంసలకు అర్హమైనది ఇషాన్ కిషన్. విరాట్ కోహ్లీది కూడా  అద్భుతమైన నాక్. చాలా అభినందనలు!’’ అంటూ టెండూల్కర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. పురుషుల వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ సచిన్. 2010 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో అజేయంగా 200 పరుగులు చేసాడు.

ఇవి కూడా చదవండి

సచిన్ ట్వీట్..

ఆ తర్వాత 219 పరుగులతో సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీ చేసి ఆ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అనంతరం రోహిత్ మూడు డబుల్ సెంచరీలు(209, 264, 208*) చేశాడు.

డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లు..

అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ మార్క్ దాటిన ఏకైక ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 2014 నవంబర్‌లో శ్రీలంకపై రోహిత్ 173 బంతుల్లో 264 పరుగుల భారీ వన్డే స్కోరు రోహిత్ పేరు మీదనే  ఉంది. కాగా సచిన్ కంటే ముందుగానే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇషాన్‌ను అభినందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..