- Telugu News Photo Gallery Cyclone Mandous many dead fisherman lost boats damaged houses washed away streets waterlogged in Chennai
Mandous Effect: తూర్పు తీర ప్రాంతాలపై ‘మాండూస్’ ఏ విధంగా ప్రభావం చూపింతో తెలుసుకుందాం రండి..
తమిళనాడు మామల్లపురం తీరం దాటిన ‘మాండూస్’ తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ పట్టణం, దాని పరిసర ప్రాంతాలపై గణనీయమైన ప్రభావం చూపి భారీ నష్టాన్ని కలిగించింది. అనేక మందిని నిర్వాసితులను.. ప్రభావం చూపిందో తెలుసుకుందాం..
Updated on: Dec 10, 2022 | 7:59 PM

తమిళనాడు మామల్లపురం తీరం దాటిన ‘మాండూస్’ తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ పట్టణం, దాని పరిసర ప్రాంతాలపై గణనీయమైన ప్రభావం చూపి భారీ నష్టాన్ని కలిగించింది. అనేక మందిని నిర్వాసితులను చేసిన ఈ తుఫాన్ చెన్నైపై ఏ విధంగా.. ప్రభావం చూపిందో తెలుసుకుందాం..

తుఫాను, భారీ వర్షాల కారణంగా చెన్నై దాని సమీప నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మత్స్యకారులు భారీగా నష్టపోవడమే కాక వారి పడవలు ప్రకృతి విధ్వంసానికి గురయ్యాయి.

నగరంలోని చిరు వ్యాపారుల దుకాణాలు కూడా ఈదురు గాలులకు నేలకొరిగాయి. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నట్లు చిత్రాల్లో చూడవచ్చు. చెన్నై నగరంలో మోకాళ్లలోతు నీరు చేరింది.

‘మండూస్’ తుఫాను తీరం దాటిన తర్వాత చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మెరైన్ సర్వీస్ రోడ్డులో పేరుకున్న ఇసుకను తొలగిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ జేసీబీ సాయంతో రోడ్డును పునరుద్ధరించేందుకు యత్నిస్తోంది.

‘మాండూస్’ తుఫాను తీరం దాటిన తర్వాత మత్స్యకారులు తమ పడవలను మరమ్మతుల కోసం లంగరు వేశారు.

‘మాండూస్’ తుఫాను గరిష్టగా చెన్నై మీదనే ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓడరేవులో పడి ఉన్న మత్స్యకారుల పడవలు విరిగి చెల్లాచెదురుగా ఉన్నాయి. కాగా ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి తీరాన్ని తాకి, నగరం అంతటా విధ్వంసం సృష్టించింది.

మత్స్యకారులకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, నష్టాన్ని అంచనా వేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

తుఫాను కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. శనివారం ఉదయం విమానాశ్రయంలోని రన్‌వేను కొద్దిసేపు మూసివేశారు. దీంతో పాటు చెన్నై నుంచి బయలుదేరే తొమ్మిది విమానాలను రద్దు చేయగా, ఇక్కడికి వచ్చే 21 విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు.

‘మాండూస్’ ప్రభావం పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపించింది. పుదుచ్చేరిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బలమైన నీటి ప్రవాహానికి బీచ్‌లోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం.. శనివారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 281.5 మి.మీ వర్షపాతం నమోదైంది.




