- Telugu News Photo Gallery Central government has decided to modernize Nagpur railway station Telugu news
నాగపూర్ రైల్వే స్టేషన్ కు మహర్దశ.. పునర్నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా..
మహారాష్ట్రలోని నాగపుర్ రైల్వే స్టేషన్ అతి ముఖ్యమైన జంక్షన్. చాలా రద్దీగా ఉండే స్టేషన్లలో ఇదీ ఒకటి. భారతీయ రైల్వేల నెట్‌వర్క్‌లో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన స్టేషన్. హౌరా-ముంబై, ఢిల్లీ-చెన్నై, ముంబైలోని ట్రంక్ లైన్‌లను విస్తరించే మార్గాలకు కీలకంగా వ్యవహరిస్తోంది. దీనిని మొదట 1867లో నిర్మించారు. అయితే స్టేషన్ ను పునర్నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 7న రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు టెండర్లు జరిగాయి. స్టేషన్ నిర్మాణం ఈపీసీ (ఇంజనీరింగ్, సేకరణ,నిర్మాణం) మోడ్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. ...
Updated on: Dec 10, 2022 | 8:11 PM

రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా మారుస్తున్నారు. రద్దీ వేళల్లో 9,000 మంది ప్రయాణికులు ఉండేలా జంక్షన్ రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మించనున్నారు. నాగ్‌పూర్ జంక్షన్‌లో 30 లిఫ్టులు, 31 ఎస్కలేటర్లు, పార్కింగ్ సౌకర్యం, మెరుగైన వెయిటింగ్ ఏరియా కూడా ఉంటాయి.

ప్రాజెక్ట్ తుది ఫలితం ఎలా ఉంటుందనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించడానికి, స్టేషన్, స్టేషన్ చుట్టుపక్కల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి ఈ స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా చిత్రాలను ట్వీట్ చేశారు. #NewIndia అద్భుతమైన మౌలిక సదుపాయాలలో భాగంగా.. నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ త్వరలో ప్రతిపాదిత మేకోవర్‌ని అందుకోనుందని తెలిపారు. స్టేషన్‌లోనూ చుట్టుపక్కల సామాజిక-ఆర్థిక అభివృద్ధితో ప్రయాణికులు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని పొందగలరు అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఉన్న తూర్పు వైపు పార్కింగ్ స్థలం సామర్థ్యాన్ని 100 నుంచి 125 కార్లకు, పార్కింగ్ సౌకర్యం లేని తూర్పు వైపు 160 సామర్థ్యంతో ఒకదాన్ని అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. 1,200 కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలు,1,000 వరకు త్రిచక్రవాహనాలు నిలిపేలా ఏర్పాటు చేస్తున్నారు.



