IND Vs PAK: ఆడకపోతే పోయేదేం లేదు.. మీకు జరిగేది మాత్రం బ్యాండ్ బరాతే
పాకిస్తాన్ మరో మూర్ఖపు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. గ్రూప్ స్టేజ్‌లో జరిగే మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించింది. ఇది రెండు దేశాల మాజీ క్రికెటర్లకు కోపం తెప్పించడమే కాదు.. ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది. ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ఆడకపోవడం వల్ల భారత్ కన్నా.. ఆ దేశ క్రికెట్‌కే అపారనష్టం వాటిల్లనుంది.

టీ20 వరల్డ్ కప్‌ను ఇప్పటికే బంగ్లా బాయ్ కాట్ చేసింది. కారణం భారత్‌పై కోపం. ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. భారత్‌తో మ్యాచ్ బాయ్ కాట్ అంటూ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌ను ఆడబోమంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల భారత్‌తో తెగిపోయిన సంబంధాలు.. పలు సందర్భాల్లో భారత క్రికెటర్లు హ్యాండ్ షేక్ చేయకపోవడంతోపాటు.. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌కు భద్రతపై అనుమానాలున్నాయన్న చీప్ రీజన్‌తో బాయ్‌కాట్ చేస్తున్నామంటూ వారి ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ నిర్ణయంపై ఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో కీలకమైన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడాన్ని తప్పుబడుతూనే.. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని ప్రకటించింది. ఇక భారత వెటరన్ క్రికెటర్లైతే పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు. గ్రూప్ మ్యాచ్ కాబట్టి బాయ్‌కాట్ అంటున్నారు.. అదే సెమీఫైనలో.. ఫైనలో అయ్యుంటే బాయ్‌కాట్ చేసేవారా అంటూ మండిపడుతున్నారు. బాయ్ కాట్ చేయడం వల్ల పాకిస్తాన్‌కు వచ్చేది శూన్యమని.. నష్టం అపారమంటున్నారు ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. అంతేకాదు భారత్‌తో తలపడాలంటే పాకిస్తాన్ భయపడుతోందన్నారు. ఇంతకన్నా మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసే లాజిక్ ఏంటో తెలియడంలేదని విమర్శించారు.
భారత మాజీక్రికెటర్ సునీల్ గావస్కర్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. గతంలో వారి క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లే.. ఇప్పుడు పాక్ ప్రభుత్వం కూడా యూటర్న్ తీసుకుంటుందన్నారు. పాకిస్తాన్‌కు ఇది అలవాటేగా అంటున్నారు. అయితే ఈ మ్యాచ్ బాయ్ కాట్ వల్ల తీవ్రమైన నష్టమే జరగనుంది. భారత్ పాక్ మ్యాచ్ విలువ రూ.2200 కోట్లు. ఈ టోర్నీలో కనీసం భారత్,పాక్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు స్కోప్ ఉంది. దీంతో దాదాపు 4500 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ జెనరేట్ కానుంది. పది సెకన్ల యాడ్ విలువ రూ.40 లక్షలు. అంటే మ్యాచ్ మొత్తానికి ఎంత లాభం ఉంటుందో అంచనా వేసుకోండి. ఈ మ్యాచ్‌కు బ్రాడ్‌కాస్టర్స్ రెవెన్యూ 250 నుంచి 350 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇది భారత్ వైపు ఉండే రెవెన్యూ. అటు పాకిస్తాన్ వైపు కూడా ఈ మ్యాచ్ బాయ్‌కాట్ వల్ల కోల్పోయే రెవెన్యూ భారీగానే ఉంది. ఇక రెండు దేశాల జట్లు దాదాపు రూ.200 కోట్ల చొప్పున నష్టపోనున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐపై దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు.
పీసీబీకి మాత్రం చాలా నష్టం వాటిల్లుతుంది. ఏ జట్టు అయినా ఒక మ్యాచ్‌ను స్వచ్ఛందంగా బహిష్కరిస్తే దానికి బీమా రక్షణ ఉండదు. దీంతో పీసీబీ పెనాల్టీలు, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఐసీసీ కూడా భారీగా ఫైన్లు విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కైతే చాలా నష్టమే జరగబోతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే రెండు మూడేళ్లు వరుసగా క్రికెట్ ఆడినా అంత రెవెన్యూ వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం వల్ల ఎంతో నష్టం వస్తోంది.. ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా లేకపోతే వారి పరిస్థితి ఏంటో మరి? ఆడి ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కన్నా.. ఆడకపోవడమే బెటర్ అనుకుంటున్నారా?
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి




