AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS Vs PAK: నీ బౌలింగ్ తగలయ్యా.! ఆ బౌలర్‌ను చూసుకుని పాక్‌ పొగరు.. దెబ్బకు దండం పెట్టాల్సిందే

పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చేసిన యాక్షన్ వివాదాస్పదమైంది. లాహోర్ T20 మ్యాచ్‌లో గ్రీన్ ఔటైన తర్వాత ఈ ఘటన జరిగింది. గతంలోనూ తారిఖ్ యాక్షన్‌పై ప్రశ్నలు రాగా, పీసీబీ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.

AUS Vs PAK: నీ బౌలింగ్ తగలయ్యా.! ఆ బౌలర్‌ను చూసుకుని పాక్‌ పొగరు.. దెబ్బకు దండం పెట్టాల్సిందే
Usman Tariq
Ravi Kiran
|

Updated on: Feb 02, 2026 | 1:41 PM

Share

పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి వివాదం చెలరేగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చేసిన ఒక యాక్షన్ దీనికి దారితీసింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 మ్యా‌చ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గ్రీన్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఔటైన తర్వాత పెవిలియన్ వైపు నడుస్తున్నప్పుడు గ్రీన్ తన చేతితో చేసిన ఒక యాక్షన్ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ యాక్షన్‌ను చూసిన చాలామంది అభిమానులు బౌలర్ బంతిని విసిరే విధంగా బౌలింగ్ చేస్తున్నాడని, అంటే చకింగ్ చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీనితో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై మళ్ళీ అనుమానాలు రేకెత్తాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొంతమంది అభిమానులు కామెరూన్ గ్రీన్ ఔటైన తర్వాత నిరాశతో అలా చేశాడని అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అతని బౌలింగ్ యాక్షన్‌పై పలుసార్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 9వ, 10వ సీజన్లలో అతని యాక్షన్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఆధ్వర్యంలో బయో మెకానిక్స్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి, అతని బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమైనదే అని ప్రకటించారు. ఈ విషయమై తారిఖ్ గతంలో స్పందిస్తూ, తన బౌలింగ్ యాక్షన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అనుమతించిన 15 డిగ్రీల ఎల్బో ఎక్స్టెన్షన్ పరిమితిలోనే ఉందని, తాను ఎలాంటి అక్రమ బౌలింగ్ చేయడంలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, తాను ఇప్పటికే రెండుసార్లు అధికారిక పరీక్షల్లో క్లియర్ అయినట్లు కూడా వెల్లడించాడు.

కామెరూన్ గ్రీన్ చేసిన యాక్షన్‌లకు రిప్లైగా, ఉస్మాన్ తారిఖ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పిల్లాడు ఏడుస్తున్న ఫోటోను పోస్ట్ చేసి, ఔటైన తర్వాత ఆటగాళ్ల చేష్టలను ఉద్దేశిస్తూ ఒక మెసేజ్ పంచుకున్నాడు. మ్యాచ్ ఫలితానికి వస్తే, ఈ T20 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 198 పరుగులు చేయగా, ఆస్ట్రేలియాను కేవలం 108 పరుగులకే ఆలౌట్ చేసి 90 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక ఆ బౌలర్ యాక్షన్‌పై ఆస్ట్రేలియా ఐసీసీకి ఫిర్యాదు చేయనుందని తెలుస్తోంది.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
ఇక కాచుకోండి.. పేరు వింటేనే ఇంగ్లాండోళ్లకు గుండెల్లో దడ..
ఇక కాచుకోండి.. పేరు వింటేనే ఇంగ్లాండోళ్లకు గుండెల్లో దడ..
బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఈ గడ్డి ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?
బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఈ గడ్డి ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్
సర్కార్ బడి టీచర్లకు.. మరోవారంలోనే స్పెషల్ TET 2026 నోటిఫికేషన్
సర్కార్ బడి టీచర్లకు.. మరోవారంలోనే స్పెషల్ TET 2026 నోటిఫికేషన్
అర్ధరాత్రి ఇంటిపక్కన పొదల్లోంచి అదోరకం శబ్ధాలు.. ఏంటని చూడగా
అర్ధరాత్రి ఇంటిపక్కన పొదల్లోంచి అదోరకం శబ్ధాలు.. ఏంటని చూడగా
పీఎఫ్ వడ్డీ పడిందా..? లేదా? సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..
పీఎఫ్ వడ్డీ పడిందా..? లేదా? సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్‌
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్‌
దహన సంస్కరాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు..
దహన సంస్కరాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు..
పిల్లలే అనుకున్నారు .. కట్‌చేస్తే.. పోలీసులకే ఊహించని ట్విస్ట్..
పిల్లలే అనుకున్నారు .. కట్‌చేస్తే.. పోలీసులకే ఊహించని ట్విస్ట్..
బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చెత్త రికార్డు
బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చెత్త రికార్డు