T20I Cricket: 6,6,6,6,6,6,6.. వామ్మో.. ఇదేం బాదుడు భయ్యా.. పాక్ బౌలర్ ఫేస్ చూస్తే పాపం అనాల్సిందే
Pakistan vs South Africa: పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Pakistan vs South Africa: 4 ఓవర్లలో 57 పరుగులు.. ఈ యాభై ఏడు పరుగుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 7. ఇలా దక్షిణాఫ్రికా బ్యాటర్లు చీల్చి చెండాడిన బౌలర్ పేరు హారిస్ రౌఫ్. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సయీమ్ అయ్యూబ్ (98) అర్ధ సెంచరీతో రాణించగా, లోయర్ ఆర్డర్‌లో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ 30 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో పాక్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. అయితే, ఈ నమ్మకాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ పవర్‌ప్లేలోనే వమ్ము చేశాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు తొలి ఆరు ఓవర్లలో 52 పరుగులు చేసింది.
ముఖ్యంగా హారిస్ రవూఫ్ వేసిన తొలి ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్ 2 భారీ సిక్సర్లతో 14 పరుగులు పిండుకున్నాడు. 11వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన రవూఫ్‌పై రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లోనూ 14 పరుగులు రాబట్టాడు.
ఆ తర్వాత హారిస్ రవూఫ్ 16వ ఓవర్ బౌల్ చేశాడు. ఈసారి కూడా రీజా హెండ్రిక్స్ 2 భారీ సిక్సర్లతో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్‌లో హారిస్ రవూఫ్ వేసిన ఓవర్‌లో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 1 సిక్స్ కొట్టి మొత్తం 13 పరుగులు సాధించాడు.
Haris Rauf celebrated his ICC Player of the Month award by scoring a half century, that too in just 24 balls.
What a legend.
What a celebration.🎉
– #SAvPAK #PakistanCricket #PAKvSA #HarisRauf #BabarAzam #SaimAyub #ChampionsTrophy2025 pic.twitter.com/XweEl8RwnT
— Ankit Uttam (@ankituttam) December 14, 2024
దీంతో హారిస్ రవూఫ్ 4 ఓవర్లలో 7 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి 57 పరుగులు చేశాడు. ఈ యాభై ఏడు పరుగులతో దక్షిణాఫ్రికా జట్టు 19.3 ఓవర్లలో 210 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
#harisrauf is the only bowler to score an impressive 57 runs in just 4 over. Every one is hitting him for 6’s. What an overhyped bowler. #SAvPAK #T20Cricket pic.twitter.com/VMafcQNLd3
— Saffron Soul 🕉️ (@gameslikeu) December 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..