AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవునా నిజమా..! శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..

గతంలో వేడినీటి కోసం గీజర్లు ఉండేవి కావు. చలికాలంలో కూడా సాధారణ నీళ్లతోనే స్నానం చేసేవారు. మన బాడీ గీజర్లకు అలవాటు పడిన తర్వాత చలికాలంలో ఇదే నీటితో స్నానం చేయాలనుకుంటాం.. ఇదే మన పిల్లల్లో భిన్నమైన అలవాటును అభివృద్ధి చేసిందంటున్నారు నిపుణులు.. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..? అసలు నిజం ఏంటో తెలుసుకుందాం..

అవునా నిజమా..! శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..
Why Some Feel Colder
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Dec 27, 2025 | 6:27 PM

Share

మనిషికి మనిషికి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. కొందరికి ఎక్కువ చలిగా, కొందరికి తక్కువగా చలి అనిపిస్తుంది. మీ శరీరం చలికి ఎలా స్పందిస్తుంది అనేది మీరు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుందని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ (ఎయిమ్స్) ప్రొఫెసర్ తెలిపారు. మీ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకుంటారనే దానిపైనే అది ఎలా ప్రవర్తిస్తుందో ఆధారపడి ఉంటుంది. ఇదే కొందరు ఎక్కువ లేదా తక్కువ చలి ఫీలయ్యేందుకు ప్రాథమిక కారణం అని నిపుణులు తెలుపుతున్నారు.

గతంలో వేడి నీటి కోసం గీజర్లు ఉండేవి కావు. చలికాలంలో కూడా సాధారణ నీళ్లతోనే స్నానం చేసేవారు. అప్పుడు శరీరం అన్నింటికి సిద్ధపడి ఉండేది.. అయితే.. మన బాడీ గీజర్లకు అలవాటు పడిన తర్వాత చలికాలంలో వేడి నీటితో స్నానం చేయాలనుకుంటున్నాం.. ఇదే మన పిల్లల్లో భిన్నమైన అలవాటును అభివృద్ధి చేసిందంటున్నారు. అందుకే చలి బాగా తగ్గినా మన పిల్లలు చల్లటి నీరు తగిలితే వణికిపోతున్నారు. అందుకే.. సాధ్యమైనంత వరకు మనం వేడి నీటితో స్నానం చేయిస్తుంటాం.. మనం కూడా ఇదే అనుసరిస్తాం.. కానీ మన చుట్టూ చాలా మందిలో బాగా చలిగా ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉండేవారు కూడా చాలామంది ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే థైరాయిడ్ పేషెంట్లు, బాగా సన్నగా ఉన్నవారు, డయాబెటిక్ పేషెంట్ లేదా బిపి నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారని.. వారికి ఎక్కువగా చలి వేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

ఇంకెవరైనా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తికి బాగా చలిగా అనిపిస్తుంది అంటే వారి శరీరంలో హీట్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ప్రొడక్షన్ అంటే 0 మనిషి శరీరం ఎంత వేడిని ఉత్పత్తి చేస్తుందో తెలియజేసేది. ఎక్ససైజ్, రెగ్యులర్ డే ఆక్టివిటీస్, బాడీలోని కొవ్వు లాంటి వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన వాతావరణాన్ని అయినా తట్టుకునేలా శరీరం దానికి అదే సిద్ధమవుతుంటుంది. ఒకవేళ బాగా చలిగా ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు కూడా శరీరం రెడీ అవుతుంది. మన అలవాట్లను బట్టి మన శరీరం తట్టుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కొందరు ఎక్కువగా చలి ఫీల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అలాగే.. వేసుకునే బట్టలు, తాగే నీరు ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి. శారీరకంగా ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేవి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువ ఉన్న వ్యక్తి తక్కువ చలి ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు అని మరికొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.

అలర్ట్.. గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు కనిపించే 5 సంకేతాలు ఇవే..

అలాగే బాడీ మాస్ ఇండెక్స్, మెటబాలిక్ రేట్ ఆధారంగా కూడా చలిని ఫీల్ అవ్వడం ఉంటుంది. ఎక్కువ మజిల్ మాస్ ఉన్నవారు తక్కువ చలిని ఫీలవుతుంటారు. వేసుకునే దుస్తులు కూడా చలిని నిర్దేశిస్తుంటాయి. అరచేతులు కాళ్లు తల వంటి శరీర భాగాలు కవర్ చేసేలా బట్టలు వేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు బయటికి వెళ్ళవు కాబట్టి కొంత తక్కువ చలి అనిపించవచ్చని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..