WPL Auction: రూ. 10 లక్షలతో ఎంట్రీ.. రూ. 1.60 కోట్లతో ఊహించని ప్రైజ్.. అసలెవరీ 16 ఏళ్ల కమలిని?
Who Is G Kamalini: మహిళల ప్రీమియర్ లీగ్ మినీ వేలం ముగిసింది. అయితే, ఈ మినీ వేలంలో చాలమంది క్రీడా కారులు తమ లక్‌ను చెక్ చేసుకున్నారు. రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఏకంగా రూ. 1. 60 కోట్లు దక్కించుకుని షాక్ ఇచ్చింది.
భారత అన్‌క్యాప్డ్ క్రీడాకారిణి జి కమలినిపై భారీ మొత్తంలో డబ్బుల వర్షం కురిసింది. ఈ 16 ఏళ్ల యువ క్రీడాకారిణిపై ముంబై ఇండియన్స్ రూ. 1.60 కోట్లు కురిపించింది. రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో మినీ వేలంలోకి వచ్చిన ఈ వికెట్‌కీపర్ కం బ్యాట్స్‌మన్ కోసం మినీ వేలంలో భారీ రేస్ జరిగింది. చివరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
16 ఏళ్ల జి కమలినిపై కాసుల వర్షం..
తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జి కమలిని పేరు వేలానికి వచ్చిన సంయంలో.. ముంబై ఇండియన్స్ మొదటగా బిడ్ చేసింది. ఆతర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. దీంతో ఏకంగా కమలిని ధర కోటి రూపాయలు దాటింది. అయినా, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌లో ఎవరూ తల వంచడానికి సిద్ధంగా లేరు.
WOW!! 😮
Young wicket-keeper G Kamalini is now part of the Mumbai Indians! 🤝
INR 1.60 Crore for the 16-year old 🔨#TATAWPLAuction | #TATAWPL | @mipaltan pic.twitter.com/PzIw3ZFDrj
— Women’s Premier League (WPL) (@wplt20) December 15, 2024
చివరికి కమలిని ధర రూ.1.5 కోట్లు దాటడంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈరోజు అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్‌లో పాకిస్థాన్ అండర్-19 మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జి కమలిని అద్భుతంగా బ్యాటింగ్ చేసి 29 బంతుల్లో 44 పరుగులు చేసింది. ఒకరకంగా ఈ స్కోర్ కూడా ఆమె ధరను పెంచడంలో సహాయపడింది.
కమలిని ఎవరు?
తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ప్రామిసింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జి కమలిని 12 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని క్రికెటర్‌గా మారేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా గత కొన్నేళ్లుగా నిరంతరం శ్రమించింది. జి కమలిని ఇటీవల దేశీయ అండర్-19 టోర్నమెంట్‌లో తమిళనాడు విజయంలో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..