AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs IND: నా ఉద్దేశం అది కాదు.. ఆ పదం వాడడం తప్పే: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన ఇసా గుహా

India vs Australia: మహిళా వ్యాఖ్యాత ఇసా గుహా ఎట్టకేలకు బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. ఇసా గుహా బుమ్రాపై ప్రైమేట్ అనే పదాన్ని ఉపయోగించింది. దీనికి కోతి అని కూడా అర్థం వస్తుంది. గబ్బా వేదికగా మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే బుమ్రాపై తాను ఏం మాట్లాడానన్న దానిపై క్లారిటీ ఇచ్చింది.

AUS vs IND: నా ఉద్దేశం అది కాదు.. ఆ పదం వాడడం తప్పే: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన ఇసా గుహా
Jasprit Bumrah Isa Guha
Venkata Chari
|

Updated on: Dec 16, 2024 | 11:36 AM

Share

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, ఈ సమయంలో అతను ఎవరూ ఊహించని దాడిని ఎదుర్కొన్నాడు. గబ్బా టెస్టు రెండో రోజు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, ఫాక్స్‌ స్పోర్ట్స్‌ వ్యాఖ్యాత ఇసా గుహా బుమ్రాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విషయం చాలా హీటెక్కింది. దీంతో ఇప్పుడు ఈ మహిళా వ్యాఖ్యాత బుమ్రాకు క్షమాపణలు చెప్పింది. ఇసా గుహా బుమ్రా కోసం ప్రైమేట్ అనే పదాన్ని ఉపయోగించారు. దీనికి కోతి అని అర్థం.

క్షమాపణలు చెప్పిన ఇసా గుహా..

గబ్బాలో మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే ఇసా గుహా క్షమాపణలు చెప్పారు. ఆమె మాట్లాడుతూ, ‘ఆదివారం, వ్యాఖ్యానం సమయంలో, నేను చాలా అర్థాలు కలిగిన పదాన్ని ఉపయోగించాను. ముందుగా నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, నన్ను క్షమించండి అంటూ చెప్పుకొచ్చింది. ఇసా గుహా ‘నేను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. వ్యాఖ్యానం మొత్తం ట్రాన్స్క్రిప్ట్ను వింటుంటే, నేను భారతదేశంలోని గొప్ప ఆటగాళ్లను ప్రశంసించినట్లు చూడొచ్చు. నేను సమానత్వాన్ని నమ్ముతాను. నేను బుమ్రా విజయం, విజయాల గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ క్రమంలో ఓ తప్పు పదాన్ని ఉపయోగించాను. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను” చెప్పుకొచ్చింది.

ఈసా గుహ ఎవరు?

ఇసా గుహా ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్. ఆమె కేవలం 16 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్ తరపున 8 టెస్టుల్లో 29 వికెట్లు పడగొట్టింది. అలాగే వన్డేల్లో 83 వన్డేల్లో 101 వికెట్లు తీసింది. టీ20లో 18 వికెట్లు కూడా తీయగలిగింది. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ మహిళా వ్యాఖ్యాతలలో ఇసా గుహా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రధాన లీగ్, సిరీస్‌లలో ఆమె వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. ఐసిసి టోర్నమెంట్లలో కూడా వ్యాఖ్యనం చేస్తుంది. మొత్తంమీద ఆమె చాలా అనుభవజ్ఞురాలైన వ్యాఖ్యాతగా పేరుగాంచింది. అయినప్పటికీ ఆమె బుమ్రాపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..