AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs KKR Preview: వాంఖడేలో మరో హై వోల్టేజ్ పోరు.. ఆ బలహీనతే కేకేఆర్ కొంపముంచేనా..?

Mumbai Indians vs Kolkata Knight Riders Indian Premier League Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ రెండవ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సొంత మైదానంలో ముంబై బలంగా కనిపిస్తుండగా, కీలక ఆటగాళ్ల గాయాలతో కోల్‌కతా బౌలింగ్ విభాగం బలహీనపడింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

MI vs KKR Preview: వాంఖడేలో మరో హై వోల్టేజ్ పోరు.. ఆ బలహీనతే కేకేఆర్ కొంపముంచేనా..?
Mi Vs Kkr Preview
Venkata Chari
|

Updated on: Mar 29, 2026 | 7:15 AM

Share

Mumbai Indians vs Kolkata Knight Riders Indian Premier League Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. 2013 నుంచి 2020 మధ్య ఐదుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు, ఈసారి ఎలాగైనా ఆరో ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌లో క్వాలిఫైయర్-2 వరకు వెళ్లి పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన ముంబై, ఈసారి మరింత పకడ్బందీగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

నైట్ రైడర్స్‌ను వేధిస్తున్న గాయాల సమస్య..

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు టోర్నీ ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. వేలం సమయంలో జట్టు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ, గాయాల కారణంగా ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా వంటి కీలక బౌలర్లు దూరమయ్యారు. అలాగే బీసీసీఐ సూచనల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు పక్కన పెట్టింది. దీనివల్ల బౌలింగ్ భారం మొత్తం వరుణ్ చక్రవర్తి, మతీషా పతిరానాపైనే పడనుంది. అజింక్యా రహానే నాయకత్వంలో కేకేఆర్ బ్యాటింగ్ బలంగా ఉన్నా, బౌలింగ్ లోటును ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

స్టార్ ఆటగాళ్లపైనే అందరి చూపు..

ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రమాదకర బౌలర్లు ఉన్నారు. వీరిద్దరి జోడి పవర్ ప్లేలో ప్రత్యర్థి వికెట్లను తీయడంలో సిద్ధహస్తులు. ఇక కోల్‌కతా జట్టులో రింకూ సింగ్, సునీల్ నరైన్, కామెరాన్ గ్రీన్ వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. వాంఖడే స్టేడియం చిన్నది కావడంతో సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇరుజట్లు..

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), డానిష్ మలేవార్, రాబిన్ మింజ్ (వికెట్ కీపర్), రయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అథర్వ అంకోలేకర్, రాజ్ బావా, కార్బిన్ బాష్, విల్ జాక్స్, మయాంక్ రావత్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తిలక్ వర్మ, అశ్విని కుమార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ఏఎం గజన్ఫర్, మయాంక్ మార్కండే, మహమ్మద్ ఇజార్, రఘు శర్మ.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), ఫిన్ అలెన్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, అంగ్‌కృష్ రఘువంశీ, రమణ్‌దీప్ సింగ్, సార్థక్ రంజన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కామ్రా, కామెరాన్ గ్రీన్, సునీల్ నరైన్, రచిన్ రవీంద్ర, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబానీ, మతీషా పతిరానా, నవదీప్ సైనీ, ప్రశాంత్ సోలంకీ, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us