Video: గాల్లో తేలుతూ కళ్లుచెదిరే క్యాచ్.. మ్యాచ్‌కే మెంటలెక్కించిన క్యాచ్.. వీడియో చూశారా?
Phil Salt Catch Video: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా దొరికింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అద్భుత విన్యాసంతో పాటు కోహ్లీ విజృంభణతో ఆర్సీబీ తన టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది.

Phil Salt Catch: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టిన భారీ షాట్‌ను ఫిల్ సాల్ట్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. బంతి బౌండరీ దాటుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో, సాల్ట్ అసాధారణ రీతిలో స్పందించి ఆ క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవడమే కాకుండా, హైదరాబాద్ పతనాన్ని శాసించింది.
సన్‌రైజర్స్ పోరాటం.. ఇషాన్ కిషన్ మెరుపులు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆదుకున్నాడు. కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ వేగంగా ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించగలిగింది. అయితే, కీలక సమయంలో సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ కిషన్ ఇన్నింగ్స్‌కు తెరదించింది.
Do we already have the best catch of the tournament ??
Stunning catch by #PhilSalt #RCBvsSRH pic.twitter.com/mP7MofVhGq
— Yogesh Kumar (@Yogesh_KP07) March 28, 2026
కోహ్లీ, పడిక్కల్ దెబ్బకు బద్దలైన రికార్డులు..
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినా, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఆ లోటును భర్తీ చేశారు. కోహ్లీ తనదైన శైలిలో అజేయంగా 69 పరుగులు చేయగా, పడిక్కల్ 61 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి భాగస్వామ్యం హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. చివరలో రజత్ పాటిదార్ మెరుపులు తోడవడంతో ఆర్సీబీ మరో 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ, మొదటి మ్యాచ్‌లోనే అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోనుంది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది.
