AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి ముంబై ఇండియన్స్ బంపర్ ఆఫర్.. రూ.30 కోట్లు ఇస్తామన్న వార్తలో నిజమెంత ?

Vaibhav Suryavanshi : ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక షాకింగ్ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ.. భవిష్యత్తు సీజన్లలో వైభవ్ సూర్యవంశీని తమ జట్టులోకి లాగేసుకోవడానికి ఒక భారీ ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి ముంబై ఇండియన్స్ బంపర్ ఆఫర్.. రూ.30 కోట్లు ఇస్తామన్న వార్తలో నిజమెంత ?
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 28, 2026 | 7:53 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్‎తో రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తున్న 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు బాది, ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ తర్వాత వైభవ్‌కు పాపులారిటీతో పాటు సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ కూడా అంతే వేగంగా చుట్టుముట్టేస్తున్నాయి.

ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక షాకింగ్ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ.. భవిష్యత్తు సీజన్లలో వైభవ్ సూర్యవంశీని తమ జట్టులోకి లాగేసుకోవడానికి ఒక భారీ ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వైభవ్‌కు ఏకంగా రూ.30 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం గిఫ్ట్‌గా ఆఫర్ చేసిందని, దీనిపై ఇరు పక్షాల మధ్య చర్చలు కూడా ముగిశాయని కొన్ని వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ క్లెయిమ్ వెనుక ఉన్న అసలు సత్యాన్ని పరిశీలిస్తే సోషల్ మీడియా మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది.

ఈ ఐపీఎల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆటతీరు మామూలుగా లేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా వస్తూ 240 కి పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్‌పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ చిన్నోడు.. ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధికంగా 680 పరుగులతో సగర్వంగా ఆరెంజ్ క్యాప్‎ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే, ముంబై ఇండియన్స్ అతనికి రూ.30 కోట్ల ఫ్లాట్ ఆఫర్ చేసిందనే వార్తను అందరూ నిజమేనని నమ్మేశారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గానీ, లేదా స్వయంగా వైభవ్ సూర్యవంశీ గానీ ఇలాంటి ఆఫర్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం కూడా ఒక జట్టులో ఉన్న ప్లేయర్‌కు వేరే ఫ్రాంచైజీ ఇలాంటి రహస్య ఆఫర్లు ఇవ్వడానికి వీల్లేదు. ఐతే ఈ రూమర్ ఎలా పుట్టిందంటే.. ఇటీవల వైభవ్ ముంబై నగరంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతంగా కొనుగోలు చేశాడు. దాని అసలు విలువ సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కొందరు సోషల్ మీడియా ఆకతాయిలు ముంబై ఇండియన్స్ ఆఫర్‌గా మార్చేసి, రూ.3 కోట్లను కాస్తా రూ.30 కోట్లుగా పెంచి ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. లలిత్ మోదీ పేరుతో కూడా కొన్ని ఫేక్ పోస్టులు ఎక్స్‌లో దర్శనమిచ్చాయి.

ప్రస్తుతానికైతే వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను జట్టును వీడి వెళ్లే ప్రసక్తే లేదు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించిన రాజస్థాన్ రాయల్స్.. మే 29న జరగబోయే అత్యంత కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో ఫైనల్ ఫైట్‌కు రాజస్థాన్ అర్హత సాధిస్తుంది. వైభవ్ తన పూర్తి ఫోకస్‌ను ఈ మ్యాచ్‌పైనే పెట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆమె పెద్ద హీరోయిన్.. చివరి చూపు కోసం వెళ్తే
ఆమె పెద్ద హీరోయిన్.. చివరి చూపు కోసం వెళ్తే
ఉదయం హడావిడికి గుడ్‌బై.. 5 నిమిషాల ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్!
ఉదయం హడావిడికి గుడ్‌బై.. 5 నిమిషాల ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్!
ఈ ఒక్క మొక్కను డెస్క్‌పై పెట్టండి.. కెరీర్ గ్రోత్, డబ్బు ప్రవాహం
ఈ ఒక్క మొక్కను డెస్క్‌పై పెట్టండి.. కెరీర్ గ్రోత్, డబ్బు ప్రవాహం
ఏంట్రా ఇదీ.. బాల్కనీలో ఓపెన్ టాయిలెట్.. బెంగళూరు ఫ్లాట్ వీడియో..
ఏంట్రా ఇదీ.. బాల్కనీలో ఓపెన్ టాయిలెట్.. బెంగళూరు ఫ్లాట్ వీడియో..
వైరల్ కుక్కర్ దమ్ చాయ్ రెసిపీ..
వైరల్ కుక్కర్ దమ్ చాయ్ రెసిపీ..
వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..
వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..
పూజ గదిలో గణేశుడిని ఇలా ఉంచితే ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందట!
పూజ గదిలో గణేశుడిని ఇలా ఉంచితే ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందట!
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు