AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : ఆర్‌సీబీ చేతిలో ఓటమి తర్వాత ధోనీ బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడా.. ఆ వైరల్ వీడియో నిజమేనా ?

Watch : కెప్టెన్ కూల్‎గా పేరు తెచ్చుకున్న ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ కామెంటేటర్, ప్రజెంటర్ తనయ్ తివారీ ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షో ది రణ్‌వీర్ షో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో RCB చేతిలో చెన్నై ఓడిపోయిన తర్వాత ధోనీ తట్టుకోలేక బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడని ఆ వీడియోలో ఉంది.

Watch : ఆర్‌సీబీ చేతిలో ఓటమి తర్వాత ధోనీ బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడా.. ఆ వైరల్ వీడియో నిజమేనా ?
Ms Dhoni
Rakesh
|

Updated on: May 28, 2026 | 5:45 PM

Share

Watch : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు 5 టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఉంటూ కెప్టెన్ కూల్‎గా పేరు తెచ్చుకున్న ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ కామెంటేటర్, ప్రజెంటర్ తనయ్ తివారీ ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షో ది రణ్‌వీర్ షో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో చెన్నై ఓడిపోయిన తర్వాత ధోనీ తట్టుకోలేక బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడని, ఈ విషయాన్ని స్వయంగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తనకు చెప్పాడని అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ ఫ్యాన్స్ దీన్ని ట్రెండ్ చేస్తుండగా, ధోనీ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న అసలు నిజానిజాలను పరిశీలిస్తే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది.

వైరల్ అవుతున్న ఆర్‌సీబీ మ్యాచ్ కథేంటి?

నిజానికి ఐపీఎల్ 2024 సీజన్లో మే 18వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య ఒక చారిత్రాత్మక మ్యాచ్ జరిగింది. ప్లే-ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్‌కేకు అత్యంత కీలకమైన మ్యాచ్ అది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 218/5 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్‌కే గట్టిగానే పోరాడింది. రచిన్ రవీంద్ర 61 రన్స్ చేయగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా 42*, ఎంఎస్ ధోనీ 25 పరుగులు చేశారు.

కానీ ఆర్‌సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్‌కే కేవలం 191 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సీఎస్‌కే ప్లే-ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ తీవ్ర నిరాశతో, కోపంతో ఊగిపోయాడని కామెంటేటర్ తనయ్ తివారీ అన్న మాటలు నిజమే అయినప్పటికీ.. బాత్రూమ్‌లో ఏడ్చాడనే లైన్ మాత్రం తప్పుడు ప్రచారమని తేలింది.

ఆ వీడియో పూర్తిగా ఫేక్!

ఈ వైరల్ వీడియోను నిశితంగా గమనించిన కొందరు ఈగల్ ఐడ్ నెటిజన్లు అసలు నిజాలను బయటపెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేయబడిన ఫేక్ వీడియో అని తేలింది. పాడ్‌కాస్ట్‌లో తనయ్ తివారీ అసలు ఏం చెప్పాడంటే.. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ధోనీ, మార్టిన్ గప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దాంతో భారత్ వరల్డ్ కప్ కల చెదిరిపోయింది. ఆ ఘోర పరాజయాన్ని, దేశాన్ని ఫైనల్‌కు చేర్చలేకపోయాననే బాధను తట్టుకోలేక ధోనీ డ్రెస్సింగ్ రూమ్ బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నాడని, ఆ విషయాన్ని జట్టుతో ఉన్న యుజ్వేంద్ర చాహల్ తనకు చెప్పాడని తనయ్ తివారీ ఆ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు. ఈ పాత ఆడియో క్లిప్‌ను తీసుకుని, ఎవరో ఆకతాయిలు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ చేతిలో సీఎస్‌కే ఓడిపోయిన మ్యాచ్‌కి లింక్ చేస్తూ ఎడిట్ చేసి వదిలారు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆరోజే ఎండ్ కార్డ్..

దురదృష్టవశాత్తూ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లోనే ధోనీ భారత్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆపై కేవలం ఐపీఎల్‌లోనే సీఎస్‌కే తరఫున ఆడుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ధోనీ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద నిరాశే ఎదురైంది. కాలిపిక్క గాయం, వేలి గాయం కారణంగా ఈ సీజన్లో ధోనీ చెన్నై తరఫున కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ధోనీ లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని సీఎస్‌కే ఈసారి కూడా ప్లే-ఆఫ్స్ చేరలేకపోయింది. మరి రాబోయే ఐపీఎల్ 2027 సీజన్లో ధోనీ మళ్లీ బ్యాట్ పడతాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us