KKR vs SRH, IPL 2024: వికెట్లను గురిచేసి కొట్టాడా ఏంది? స్టార్క్ సూపర్ బాల్..హెడ్‌కు మైండ్ బ్లాక్.. వీడియో
తమ బ్యాటర్లపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు కెప్టెన్ కమిన్స్. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు హైదరాబాదీ బ్యాటర్లు. కేకేఆర్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాటర్లు ఒక్కొక్కరూ పెవిలియన్ చేరుకున్నారు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో భాగంగా కోల్ కతాతో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కవగా ఉండడంతో కమిన్స్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తమ బ్యాటర్లపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు కెప్టెన్ కమిన్స్. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు హైదరాబాదీ బ్యాటర్లు. కేకేఆర్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాటర్లు ఒక్కొక్కరూ పెవిలియన్ చేరుకున్నారు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన డెలివరీతో ట్రావిస్ హెడ్‌ను బోల్తా కొట్టించాడు.
తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్‌ను గురి పెట్టి గుడ్‌లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ప్యాడ్, బ్యాట్ మధ్య ఉన్న గ్యాప్ లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దెబ్బకు స్టంప్స్ గాల్లోకి ఎగిరాయి. దీనిని చూసిన హెడ్ కు కాసేపు మైండ్ బ్లాక్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఇదిగో..
Starc sets the tone for Qualifier 1 with a ripper! 🔥#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #IPLinBengali pic.twitter.com/3AJG5BvZwT
— JioCinema (@JioCinema) May 21, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్లు:
అంకుల్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, KS భరత్, షెర్ఫైన్ రూథర్‌ఫోర్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




