AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరొక దిగ్గజ ప్లేయర్.. అసలు ఊహించలేదు

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగియనుంది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఈ ఏడాది జూన్ 30తో హెడ్ కోచ్ గా మిస్టర్ డిపెండబుల్ పదవికి ఎండ్ కార్డ్ పడనుంది. అలాగే కొత్త ప్రధాన కోచ్ పదవీకాలం జూలై 1 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది.

Team India: గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరొక దిగ్గజ ప్లేయర్.. అసలు ఊహించలేదు
Team India Coach
Basha Shek
|

Updated on: May 21, 2024 | 8:15 PM

Share

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగియనుంది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఈ ఏడాది జూన్ 30తో హెడ్ కోచ్ గా మిస్టర్ డిపెండబుల్ పదవికి ఎండ్ కార్డ్ పడనుంది. అలాగే కొత్త ప్రధాన కోచ్ పదవీకాలం జూలై 1 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. గత కొన్ని రోజులుగా ఈ పోస్ట్ కోసం చాలా మంది పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ పోస్టుకు పలువురు విదేశీ, భారత మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. బీసీసీఐ కూడా కొందరు మాజీ క్రికెటర్లకు చీఫ్ కోచ్ పదవి ఇవ్వాలని అభ్యర్థించినట్లు వెలుగులోకి వస్తోంది. నివేదిక ప్రకారం, స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్ పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే ఫ్లెమింగ్‌తో చర్చ విఫలమవడంతో గౌతమ్ గంభీర్ పేరు ఖరారైంది. అయితే ఇప్పుడు మరొక కొత్త పేరు తెరమీదకు వచ్చింది. అతనే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ దిగ్గజ ప్లేయర్ కూడా టీమిండియా ప్రధాన కోచ్ పదవిని చేపట్టాలన్న కోరికను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏఎన్‌ఐతో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, “క్రికెట్ తనకు చాలా ఇచ్చింది. భారత జట్టుకు ఏదైనా తిరిగి ఇచ్చే అవకాశం వస్తే, అది చాలా గొప్పది. నేను పోస్ట్ కోసం దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు’ అని చెప్పుకొచ్చాడు భజ్జీ.

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ బీసీసీఐ పరిశీలిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దరఖాస్తు కోసం కొన్ని షరతులు విధించింది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, ఆటగాడు కనీసం 30 టెస్టులు మరియు 50 వన్డేలు ఆడి ఉండాలి. రెండేళ్ల వరకు దేశ టెస్టు జట్టుకు కోచ్‌గా పనిచేసిన వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్, అసోసియేట్ మెంబర్, ఇంటర్నేషనల్ లీగ్, ఫస్ట్ క్లాస్ టీమ్ లేదా నేషనల్ ఎ టీమ్‌కు మూడేళ్లపాటు కోచ్‌గా పనిచేసిన వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, బీసీసీఐ నుంచి లెవల్ 3 లేదా తత్సమాన సర్టిఫికెట్ పొందిన కోచ్‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..