AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ‘నీ బ్యూటీ సీక్రెట్ ఇదా’! షేవింగ్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా సినిమా హీరోయిన్లు తమ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అలాగే తమ అందానికి కారణమైన బ్యూటీ టిప్స్ ను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అలాగే ఫిట్ నెస్ టిప్స్ ను కూడా సామాజిక మాధ్యమాల వేదికగా చెబుతారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. తాను షేవింగ్ చేసుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Actress: 'నీ బ్యూటీ సీక్రెట్ ఇదా'! షేవింగ్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Actress
Basha Shek
|

Updated on: May 20, 2024 | 7:05 PM

Share

సాధారణంగా సినిమా హీరోయిన్లు తమ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అలాగే తమ అందానికి కారణమైన బ్యూటీ టిప్స్ ను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అలాగే ఫిట్ నెస్ టిప్స్ ను కూడా సామాజిక మాధ్యమాల వేదికగా చెబుతారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. తాను షేవింగ్ చేసుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవికాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటోలు అవే. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు స్టార్ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘మీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా?’ అంటూ జోకులు పేలుస్తున్నారు. మరి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార సోనమ్ కపూర్. ఈ మధ్యన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ సొగసరి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలా తాజాగా రేజర్ తో షేవింగ్ చేసుకున్న ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదే ఏకంగా ఆరు ఫొటోలను వివిధ పోజుల్లో అభిమానులతో పంచుకుంది.

అయితే సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పటివి కావని తెలుస్తోంది. మరి ఇప్పుడెందుకు షేర్ చేసిందో అర్థం కాక అభిమానులు, నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు ఫన్నీ జోకులు వేస్తున్నారు. ‘మీ అందం వెనక అసలు రహస్యం ఇదేనా’, ‘ఏదైనా రేజర్ కంపెనీకి ప్రమోషన్ చేస్తున్నావా’? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బ్లైండ్ అనే సినిమాలో నటించింది సోనమ్ కపూర్. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సోనమ్ కపూర్ షేర్ చేసిన ఫొటోలు..

ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2018లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను సోనమ్ కపూర్ వివాహం చేసుకుంది. 2022 ఆగస్టు 20న మగబిడ్డకు జన్మనిచ్చిందీ అందాల తార.

భర్త, కుమారుడితో సోనమ్ కపూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే