AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఇది కదా అసలైన అభిమానం.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం దేవర సినిమాలో బిజీగా ఉంటోన్న తారక్ సోమవారం (మే 20) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు హీరోలు, నటీనటులు, అభిమానులు, నెటిజన్లు యంగ్ టైగర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

Jr NTR: ఇది కదా అసలైన అభిమానం.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్.. ఫొటోస్ వైరల్
Jr.NTR fans
Basha Shek
|

Updated on: May 20, 2024 | 7:30 AM

Share

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం దేవర సినిమాలో బిజీగా ఉంటోన్న తారక్ సోమవారం (మే 20) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు హీరోలు, నటీనటులు, అభిమానులు, నెటిజన్లు యంగ్ టైగర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటే అతని అభిమానులకు పండగే. ఎక్కడ చూసినా కటౌట్లు, పోస్టర్లు, కేక్ కటింగ్స్ కార్యక్రమాలు ఉండనే ఉంటాయి. అదే సందర్భంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘రా ఎన్టీఆర్‌ 2.0’ వ్యవస్థాపకులు పెద్ద ఎత్తున రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ టీమ్ స్వచ్ఛందంగా ‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి ఆపన్న హస్తం అందించడంలో ఈ టీమ్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ఒక పేజీని కూడా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో తారక్ బర్త్ డేను పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదానం కార్యక్రమం నిర్వహించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘ఇది కదా అసలైన అభిమానం… వీరు కదా నిజమైన ఫ్యాన్స్’ అంటూ ఎన్టీఆర్ అభిమానులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో మలయాళ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ లీడ్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

రక్తదానం చేస్తోన్న ఎన్టీఆర్ అభిమానులు..

View this post on Instagram

A post shared by RAW NTR (@rawntrofficial)

అభిమాని గుండెలపై ఆటో గ్రాఫ్ ఇస్తోన్న యంగ్ టైగర్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్