AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

తనను బాగా ఇబ్బంది పెడుతోన్న మయోసైటిస్ ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లొచ్చింది సమంత. ఆ తర్వాత సినిమా షూటింగుల్లో బిజీ అవుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రమే ఉంది. అలాగే ఇటీవల తన పుట్టిన రోజున నిర్మాతగా ఒక సినిమాను కూడా అనౌన్స్ చేసింది.

Samantha: తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Samantha
Basha Shek
|

Updated on: May 20, 2024 | 8:23 PM

Share

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది నటి సమంత. అయితే ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తనను బాగా ఇబ్బంది పెడుతోన్న మయోసైటిస్ ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లొచ్చింది సమంత. ఆ తర్వాత సినిమా షూటింగుల్లో బిజీ అవుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రమే ఉంది. అలాగే ఇటీవల తన పుట్టిన రోజున నిర్మాతగా ఒక సినిమాను కూడా అనౌన్స్ చేసింది. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిందీ అందాల తార.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్‌ ఫ్యాన్‌ అయిన అమ్మాయి ఎంసెట్‌ లో మంచి ర్యాంక్‌ సాధించడంతో తెగ ఖుషి అవుతోంది సమంత. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ టాప్ ర్యాంకర్ కు అభినందనలు తెలిపిందీ ముద్దుగుమ్మ. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో తన డై హార్డ్ ఫ్యాన్ తో దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత ‘ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్’‌ అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన అభిమానిని గుర్తు చేసుకుని మరీ అభినందించిన ఈ అందాల తారపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. కాగా ఇటీవల సమంత మార్ఫింగ్ బారిన పడింది. దీనిని నిజమనుకుని చాలా మంది సామ్ ను ట్రోలింగ్ చేశారు. తీరా అది ఓ నెటిజన్ చేసిన చిల్లర పని అని తెలిసింది. కాగా ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించింది సమంత. అలాగే పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.ఇక వరుణ్ ధావన్‌తో సమంత నటించిన ‘హనీ బాని’ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి
Samantha Post

Samantha Post

సమంత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!