- Telugu News Photo Gallery Cinema photos Sara Tendulkar Dating With Rich Young Entrepreneur siddharth Kerkar, Photos Goes Viral
Sara Tendulkar: గిల్‌తో బ్రేకప్.. ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్ వైరల్
సచిన్ టెండూల్కర్ గారాల పట్టిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సారా టెండూల్కర్. స్టార్ కాకపోయినా సినిమా హీరోయిన్లకు మించి క్రేజ్ తెచ్చుకుందీ స్టార్ కిడ్. సోషల్ మీడియాలో సారాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇప్పుడు బ్రాండింగ్ ద్వారా కూడా మంచి డబ్బు సంపాదిస్తోందీ ముద్దుగుమ్మ.
Updated on: May 23, 2024 | 4:53 PM

సచిన్ టెండూల్కర్ గారాల పట్టిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సారా టెండూల్కర్. స్టార్ కాకపోయినా సినిమా హీరోయిన్లకు మించి క్రేజ్ తెచ్చుకుందీ స్టార్ కిడ్. సోషల్ మీడియాలో సారాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇప్పుడు బ్రాండింగ్ ద్వారా కూడా మంచి డబ్బు సంపాదిస్తోందీ ముద్దుగుమ్మ.

ఇక లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ ముద్దుగుమ్మ. గిల్ తో ప్రేమాయణం నడుపుతుందని, ఇద్దరకీ బ్రేకప్ కూడా అయ్యిందని ప్రచారం జరిగింది.

అయితే ఈ రూమర్లపై ఎవ్వరూ బహిరంగంగా స్పందించిన దాఖలాలు లేవు.ఇదిలా ఏంటూ ప్రస్తుతం సారా టెండూల్కర్, గోవాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధార్థ్ కెర్కర్ తో డేటింగ్ చేస్తోందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు తెగ వైరలవుతుండడమే ఈ రూమర్లకు కారణం. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

కాగా హిమాన్ష్ కోహ్లీతో కూడా సారా డేటింగ్ లో ఉందని ఆమధ్యన ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం.