AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీమ్.. రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన మంచు ఫ్యామిలీ.. వీడియో చూశారా?

ఇండియా నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతెలా తదితరులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా కన్నప్ప చిత్ర బృందం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది.

Kannappa: కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీమ్.. రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన మంచు ఫ్యామిలీ.. వీడియో చూశారా?
Manchu Family
Basha Shek
|

Updated on: May 20, 2024 | 9:44 PM

Share

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన అందాల తారలు, నటులు, నటీమణులు ఇక్కడి రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఇక ఇండియా నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతెలా తదితరులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా కన్నప్ప చిత్ర బృందం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. మంచు విష్ణు- వెరానిక దంపతులు, మోహన్‌ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ‘హారిజన్: యాన్ అమెరికన్ సాగా’ స్పెషల్ స్క్రీనింగ్‌లో వీరంతా పాల్గొన్నారు. ఈ విషయాన్ని హీరో మంచు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజి క మాధ్యమాల్లో వైరల్ గా మారిది. కాగా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా కన్నప్ప టీజర్ ను లాంఛ్ చేయనున్నారని సమాచారం.

కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప తెరకెక్కుతోంది. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ కనిపించనున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్‌ కుమార్‌, నయనతార, ప్రీతి తదితరులు కన్నప్ప సినిమాలో నటించనున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులో భాగమైనట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కన్నప్ప టీమ్.. వీడియో ఇదిగో..

టీచర్ లాంచ్ చేయనున్నారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!