AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup Final: దేవుడా గెలిపించు..! టీమిండియా విజయం కోసం ఖైరతాబాద్ గణేష్ కమిటీ పూజలు

క్రికెట్ అంటే ఒక మాట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ అని చాలాసార్లు నిరూపితమైంది. ఈసారి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. విజయం అడుగు దూరంలో ఉండే సరికి అందరిలో ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు మనమే నెంబర్ వన్ అనుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఇండియా ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ గెలవాలని దేశప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భారత్ ప్రపంచ కప్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Ashok Bheemanapalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 19, 2023 | 12:53 PM

Share

హైదరాబాద్, నవంబర్19; ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ నడుస్తుంది. క్రికెట్.. క్రికెట్.. క్రికెట్ ఎక్కడ విన్నా ఇదే మాట అందరి ఆశలు ఈసారి ఇండియా గెలుస్తుందనే… జీతేగా భాయ్ జీతేగా ఇండియా జీతేగా… దేశవ్యాప్తంగా అభిమానులు జపం చేస్తున్నారు. ఇంకా ఒక్క అడుగు దూరంలోనే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు..సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ కి చేరుకున్న భారత్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ పై చేయి సాధించింది. ఇక ఆ ఒక్క మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇండియా గెలవాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు, క్రికెట్‌ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒకరు ఉపవాసం ఉంటే మరొకరు దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ భక్తిని చూపిస్తున్నారు. ఇక క్రికెట్ మ్యాచ్‌ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అంతలా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

క్రికెట్ అంటే ఒక మాట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ అని చాలాసార్లు నిరూపితమైంది. ఈసారి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. విజయం అడుగు దూరంలో ఉండే సరికి అందరిలో ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు మనమే నెంబర్ వన్ అనుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఇండియా ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ గెలవాలని దేశప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భారత్ ప్రపంచ కప్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించాలని హోమం….నిర్వహించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రత్యేక పూజలు, హోమం ఏర్పాటు చేసారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రార్థనలు, పూజలు చేస్తూ భారత్‌ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..