ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ సోదాలు.. లుంగీలో దాచిన గోల్డ్‌ గుట్టురట్టు.. కోట్లల్లో పట్టుబడ్డ బంగారం

గోల్డ్‌ స్మగ్లింగ్ కోసం వీళ్లు చేసిన పథకం తెలిసి కస్టమ్స్‌ అధికారులే బిత్తరపోయారు. ఎవరూ ఊహించని విధంగా వీరు.. సుహైబ్ నుంచి ఫ్లాస్క్‌లో దాచి తెచ్చిన 1.959 కిలోల బంగారం మిశ్రమాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారు మిశ్రమం విలువ దాదాపు రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో వ్యక్తి వద్ద లుంగీల్లో దాచిన కిలోకి పైంగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అతని వద్ద లభించిన 10 లుంగీలను స్వాధీనం చేసుకున్నారు..

ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ సోదాలు.. లుంగీలో దాచిన గోల్డ్‌ గుట్టురట్టు.. కోట్లల్లో పట్టుబడ్డ బంగారం
Illegal Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2023 | 12:18 PM

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కోజికోడ్‌కు చెందిన సుహైబ్ (34)ను కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్ కోసం వీళ్లు చేసిన పథకం తెలిసి కస్టమ్స్‌ అధికారులే బిత్తరపోయారు. ఎవరూ ఊహించని విధంగా వీరు.. సుహైబ్ నుంచి ఫ్లాస్క్‌లో దాచి తెచ్చిన 1.959 కిలోల బంగారం మిశ్రమాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారు మిశ్రమం విలువ దాదాపు రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా.

తిరువనంతపురం, కమలేశ్వరానికి చెందిన మరో ప్రయాణికుడు ముహమ్మద్ అఫ్సర్ (28) కూడా బంగారు ద్రావణంలో ముంచి బ్యాగ్‌లో ఉంచిన లుంగీలను స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్‌ కోటెడ్‌తో మడిచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న10 లుంగీలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా,.. లగేజీని ఎక్స్‌రే తనిఖీ చేశారు. దాంతో బంగారంలో ముంచిన లుంగీల గుట్టు రట్టైంది. దీంతో సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

లుంగీ నుంచి బంగారాన్ని వేరు చేసి కొచ్చిలోని కస్టమ్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ లుంగీల్లో సుమారు కిలో బంగారం ఉన్నట్లు అంచనా. దీని ధర దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుంది. వీరిద్దరూ నిన్న ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో భారత్‌కు వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..