AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Micro Art on Rice: బియ్యపు గింజంత సైజుతో వరల్డ్ కప్.. మెగా ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు అందర్ని ఆకర్షించేలా..

వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం కోసం అందరూ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. గత 10 మ్యాచ్‌ల్లోనూ ప్రతీ ఆటగాడు తమవంతు రాణించారు.  ఇండియా లాంటి దేశంలో క్రికెట్ అంటే అదో జాతీయ పండగ వంటిది. అందుకే అందరూ మ్యాన్ ఇన్ బ్లూ కి తమదైన స్టైల్ లో సపోర్ట్ చేస్తూ కనిపిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులంతా కంటిమీద కునుకు లేకుండా ఫైనల్‌ ఫైట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.

Micro Art on Rice: బియ్యపు గింజంత సైజుతో వరల్డ్ కప్.. మెగా ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు అందర్ని ఆకర్షించేలా..
Micro Art On Rice
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 19, 2023 | 10:34 AM

Share

కర్నూలు, నవంబర్19; ఈ రోజు జరిగే ప్రపంచ కప్ లో ఇండియా గెలవాలంటు ఆకాంక్షిస్తూ ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజ పై గీసిన సూక్ష్మ చిత్రం అందరిని అకట్టుకుంటుంది. తన సూక్ష్మ కళతో ఎన్నో చిత్రాలు గీసి అందరి మన్ననలు పొందిన కోటేష్ ఈ సారి ఎంతో శ్రమించి బియ్యపు గింజ పై వరల్డ్ కప్ నమూన కప్ పై భాగన ఇండియా జాతీయ జెండా, క్రమది భాగాన అందరి చూపులు ఇండియా కప్‌గెలవాలనే ఆకాంక్ష తో కన్నుతో ఎదురు చూస్తూన్నట్లు రూపొందించారు.

ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ప్రపంచకప్ ఫైనల్ లో ఇండియా అస్ట్రేలియా పై గెలవాలనే బలమైన ఆకాంక్ష తో ఈ సూక్ష్మ చిత్రం వేశానని,ప్రపంచం అంతా ఇండియా గెలవాలనే ఆకాంక్షతో చూస్తూ ఉందని,అందుకే ఇండియా జాతీయ జెండా,ప్రపంచ కప్,ఒక కన్ను ఇలా మూడు చిత్రాలను ఒకే బియ్యపు గింజ పై వెయ్యడం జరిగిందన్నారు.ప్రపంచ కప్ ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలని,ఇండియా ఖచ్చితంగా గెలుస్తూందనే ఆశాభావం చిత్రకారుడు చింతల్లె కోటేష్ వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మరికొన్ని గంటల్లో జరగబోయే మెగా మ్యాచ్ తర్వాత క్రికెట్ కింగ్ ఎవరు అనేది తేలనుంది.. ఇకపోతే, మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒంటి గంట 35 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకూ సుమారు 15 నిమిషాల పాటు ఎయిర్ షో నిర్వహించనుంది బీసీసీఐ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఎయిర్‌షో చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం కోసం అందరూ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. గత 10 మ్యాచ్‌ల్లోనూ ప్రతీ ఆటగాడు తమవంతు రాణించారు.  ఇండియా లాంటి దేశంలో క్రికెట్ అంటే అదో జాతీయ పండగ వంటిది. అందుకే అందరూ మ్యాన్ ఇన్ బ్లూ కి తమదైన స్టైల్ లో సపోర్ట్ చేస్తూ కనిపిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులంతా కంటిమీద కునుకు లేకుండా ఫైనల్‌ ఫైట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దత్తసాయి దేవాలయంలో 108 టెంకాయలను కొట్టి క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ జట్టు గెలవాలని ఇక్కడ యువకులు జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..