AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare Tips: సన్‌స్క్రీన్‌కి సంబంధించిన ఈ అపోహలు అబద్ధాలు.. వాటి నిజం తెలుసుకోండి

కొంతమంది తమ సన్‌స్క్రీన్ SPF 50 కాబట్టి, దాన్ని రోజులో ఒక్కసారి ముఖానికి అప్లై చేస్తే చాలు..మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అయితే వాస్తవానికి అది అలా కాదు. సన్‌స్క్రీన్ రెండు గంటలు మాత్రమే పని చేస్తుందని మీరు తెలుసుకోవాలి. సన్‌స్క్రీన్ నుండి మీరు ఎంత రక్షణ పొందుతున్నారో SPF నంబర్ మీకు తెలియజేస్తుంది. కాలానికి దీనితో సంబంధం లేదు. మీరు బయటకు వెళ్లే ముందు SPF 30 నంబర్ లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ప్రతి రెండు గంటలకొకసారి దాన్ని మళ్లీ అప్లై చేయండి.

Skincare Tips: సన్‌స్క్రీన్‌కి సంబంధించిన ఈ అపోహలు అబద్ధాలు.. వాటి నిజం తెలుసుకోండి
Skincare Tips
Jyothi Gadda
|

Updated on: Nov 19, 2023 | 7:36 AM

Share

చర్మ సంరక్షణ విషయానికి వస్తే, మనమందరం సన్‌స్క్రీన్‌తో పాటు అనేక ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తాము. ప్రస్తుతం సూర్యుని నుండి రక్షణకు ఇది చాలా అవసరమని భావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందువల్ల, సన్ టాన్ లేదా సన్ బర్న్ మొదలైన వాటి నుండి చర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ, నేటికీ చాలా మంది సన్‌స్క్రీన్‌కు సంబంధించిన కొన్ని అపోహలు నిజమని నమ్ముతున్నారు. ఈ అపోహల కారణంగా కొన్నిసార్లు మనం సన్‌స్క్రీన్‌ను ఉపయోగించము. కొన్నిసార్లు తప్పుగా ఉపయోగిస్తాము. కాబట్టి, ఈ రోజు మనం సన్‌స్క్రీన్‌కు సంబంధించిన కొన్ని అపోహలు, వాటి వెనుక వాస్తవాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

డార్క్ స్కిన్‌ ఉన్నవారు సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం లేదా..?

కొందరు స్త్రీలు తమ చర్మం నల్లగా ఉంటే సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అయితే వాస్తవానికి ఇది నిజం కాదు..ముదురు రంగు చర్మం వారిపై కూడా సూర్యరశ్మి ప్రభావం సమానంగానే ఉంటుందని మీరు తెలుసుకోవాలి. అయితే, డార్క్ స్కిన్ మీద సన్ డ్యామేజ్ చూడటం కష్టం. కాబట్టి మనకు సన్‌స్క్రీన్ అవసరం లేదు. చర్మం రంగు ఏదైనప్పటికీ, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ముఖ్యంగా ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.

ఇవి కూడా చదవండి

సన్‌స్క్రీన్ SPF 50ని రోజులో ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందా..?

కొంతమంది తమ సన్‌స్క్రీన్ SPF 50 కాబట్టి, దాన్ని రోజులో ఒక్కసారి ముఖానికి అప్లై చేస్తే చాలు..మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అయితే వాస్తవానికి అది అలా కాదు. సన్‌స్క్రీన్ రెండు గంటలు మాత్రమే పని చేస్తుందని మీరు తెలుసుకోవాలి. సన్‌స్క్రీన్ నుండి మీరు ఎంత రక్షణ పొందుతున్నారో SPF నంబర్ మీకు తెలియజేస్తుంది. కాలానికి దీనితో సంబంధం లేదు. మీరు బయటకు వెళ్లే ముందు SPF 30 నంబర్ లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ప్రతి రెండు గంటలకొకసారి దాన్ని మళ్లీ అప్లై చేయండి.

ఎండలోకి వెళ్లిన్నప్పుడు మాత్రమే సన్‌స్ర్కీన్‌ ఉపయోగించాలా..?

ఇది సన్‌స్క్రీన్‌కి సంబంధించిన సాధారణ సందేహం. ఇది అందరూ నిజమని నమ్ముతారు. ఎండలేని రోజులలో కూడా సూర్యుడి UV రేడియేషన్ ఉంటుంది. అందువల్ల, సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశించకపోయినా, ఈ UV రేడియేషన్ మీ చర్మాన్ని ఇంకా దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో వాతావరణం ఎలా ఉన్నా, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాయడం చాలా ముఖ్యం.

సన్‌స్క్రీన్ వాటర్‌ప్రూఫ్ అయితే..

మీ సన్‌స్క్రీన్ వాటర్‌ప్రూఫ్ అయితే మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు లేదంటే చెమట పట్టేటప్పుడు సన్‌స్ర్కీన్‌ ఉపయోగించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే, అది పూర్తిగా తప్పు. ఖచ్చితంగా కొన్ని సన్‌స్క్రీన్‌లు వాటర్ రెసిస్టెంట్ అని చెబుతున్నాయి. కానీ, అవి వాటర్‌ప్రూఫ్ కాదు. అందువల్ల మీరు స్విమ్మింగ్‌ చేసినా, చెమటపట్టినా మళ్లి మళ్లీ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాల్సి ఉంటుంది.

సన్‌స్క్రీన్ క్యాన్సర్‌కు కారణమవుతుంది..

చాలా మంది సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని నమ్ముతారు. అయితే, దీనికి ఇంకా వైద్యపరమైన ఆధారాలు లేవు. కానీ సూర్యుడి నుండి వచ్చే UV కిరణాలు మాత్రం క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..