Ghee Benefits: పరగడుపునే చెంచా నెయ్యి తింటే చాలు, మీ జీవితాన్నే మార్చే లాభాలున్నాయి..!

నెయ్యి, వెన్న వంటి పదార్థాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది.. అలాగే, నెయ్యిని కూడా ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ నెయ్యిని తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Ghee Benefits: పరగడుపునే చెంచా నెయ్యి తింటే చాలు, మీ జీవితాన్నే మార్చే లాభాలున్నాయి..!
Ghee
Follow us

|

Updated on: Nov 19, 2023 | 6:59 AM

రోజూ ఒక చెంచా నెయ్యి తింటే ఊబకాయం వస్తుందా..? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. అయితే రోజూ ఒక చెంచా నెయ్యి సేవించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మీకు ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగించకపోయినా, మీ శరీరం ఖచ్చితంగా చాలా ప్రయోజనాలను పొందుతుందని అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి, వెన్న వంటి పదార్థాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది.. అలాగే, నెయ్యిని కూడా ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ నెయ్యిని తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పోషణ..

నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఈ కొవ్వులో విటమిన్ ఎ, ఇ, డి పుష్కలంగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ లోపాన్ని నెయ్యి తీసుకోవడం ద్వారా భర్తీ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యకు నెయ్యిని తీసుకోవడం చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. నెయ్యితో అల్సర్ సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చర్మాన్ని మెరిసేలా మరియు ఆరోగ్యంగా కూడా చేయవచ్చు. ప్రతిరోజూ కనీసం ఒక చెంచా నెయ్యి తింటే కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే, మీరు అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

పరగడుపున నెయ్యి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయం కాఫీ, టీ తాగడం కంటే నెయ్యిని తీసుకుంటే మంచిది. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది. నెయ్యి తీసుకోవటం వల్ల చర్మం కాంతివంతంగా మారడంతో పాటు తల వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..

నెయ్యి తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుపడటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నెయ్యి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్