Watch Video: యముడ్ని కలవాలని అంత ఆశగా ఉందా బాబు.. ఇలాంటి స్టంట్‌లు చేస్తున్నావ్..వీడియో చూస్తే కళ్లు బైర్లే..

అతడు రైలింగ్‌పై ఎంతో నిర్భయంగా నిలబడి ఉన్నాడు. రెయిలింగ్‌పై అతడు ఎటువంటి సపోర్టు లేకుండా నిలబడి ఉన్నాడు. అక్కడ్నుంచి ఏ మాత్రం అటు ఇటుగా అదుపు తప్పినా కూడా ..ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే.. శరీరం కూడా తూనాతునకలు అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. కానీ, అతడు ఎవరూ ఊహించని సాహసం చేశాడు..ఒక భవనం నుంచి మరో భవనంపైకి దూకుతున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు అతని ముఖంలో ఏ చిన్నపాటి భయం ఆనవాళ్లు కూడా కనిపించలేదు... అతడిని చూస్తుంటే

Watch Video: యముడ్ని కలవాలని అంత ఆశగా ఉందా బాబు.. ఇలాంటి స్టంట్‌లు చేస్తున్నావ్..వీడియో చూస్తే కళ్లు బైర్లే..
Man Risk His Life
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 18, 2023 | 1:33 PM

స్టంటింగ్‌ అంటే ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడూ చిన్న చిన్న విన్యాసాలు చేయరు. ప్రాణాపాయం కలిగించేవి, లేదంటే.. వాటిని చూసిన ఇవతలి వ్యక్తులకు గూస్‌బంప్‌లను కలిగించే విన్యాసాలను ఎల్లప్పుడూ ఇష్టపడుతుంటారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక షాకింగ్ స్టంట్‌ల వీడియోలను మీరు అనేకం చూసి ఉంటారు. అయితే ఈ రోజుల్లో అలాంటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ఈ స్టంట్ వీడియో చాలా ప్రమాదకరమైనది. కానీ, స్టంట్‌మ్యాన్ చాలా హాయిగా చేస్తున్నాడు, వైరల్ వీడియో చూసిన కానీ ప్రేక్షకులు స్పృహా కోల్పోయారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బహుళ అంతస్తుల భవనం పైకప్పుపై ఒక వ్యక్తి ఉన్నాడు.. అతను పైకప్పు మీది సన్నని రెయిలింగ్‌పై బ్యాలెన్స్ చేస్తూ నిలబడి ఉన్నాడు. పైకప్పు నుండి కిందకు చూస్తే.. అక్కడి రోడ్డు విజువల్‌ ఎంతో భయానకంగా కనిపిస్తుంది. చాలా మంది వ్యక్తులు అంత ఎత్తు నుండి కిందకు చూడలేరు. కానీ, ఈ వ్యక్తిని చూడండి. అతడు రైలింగ్‌పై ఎంతో నిర్భయంగా నిలబడి ఉన్నాడు. రెయిలింగ్‌పై అతడు ఎటువంటి సపోర్టు లేకుండా నిలబడి ఉన్నాడు. అక్కడ్నుంచి ఏ మాత్రం అటు ఇటుగా అదుపు తప్పినా కూడా ..ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే.. శరీరం కూడా తూనాతునకలు అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. కానీ, అతడు ఎవరూ ఊహించని సాహసం చేశాడు..ఒక భవనం నుంచి మరో భవనంపైకి దూకుతున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు అతని ముఖంలో ఏ చిన్నపాటి భయం ఆనవాళ్లు కూడా కనిపించలేదు… అతడిని చూస్తుంటే ఈ వ్యక్తి చాలా డేంజరస్ స్టంట్స్ చేస్తున్నాడనిపిస్తోంది. అందుకే అస్సలు భయం అనిపించదు. చాలా సార్లు వీడియో చూసిన తర్వాత పడిపోతాడేమో అనిపించింది. కానీ ఆ వ్యక్తి తన పాదాలను ఎక్కడా తడబడనివ్వలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Mr.Polianskii (@polianskii)

ఈ వీడియోను పోలియన్స్కీ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసారు. అతను తనను తాను గ్రేట్‌ స్టంట్‌మ్యాన్‌గా అభివర్ణించుకున్నాడు. ఇతడికి ఇలాంటి విన్యాసాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య.. అతని ప్రొఫైల్‌లో చాలా స్టంట్స్ వీడియోలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..