AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో రామయ్య దర్శనానికి వెళ్లిన వారు ముస్లింలుగా బయటకు వస్తారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ రామాలయం గురించి మాట్లాడుతూ.. “భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా మంచి పని చేసారు. ఒక మసీదును దేవాలయంగా మార్చారు. మన మూలాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ గుడికి వెళ్లే వారందరూ ముస్లింలుగా బయటకు వస్తారని తాను నమ్ముతున్నాను. మీరు తప్పు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ విషయాన్నీ ప్రజలు అర్థం చేసుకోవడం లేదంటూ వివరించే ప్రయత్నం చేశారు.

అయోధ్యలో రామయ్య దర్శనానికి వెళ్లిన వారు ముస్లింలుగా బయటకు వస్తారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Javed Miandad
Surya Kala
|

Updated on: Nov 18, 2023 | 1:27 PM

Share

ఓ వైపు అయోధ్యలోని రామయ్య ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ప్రారంభోత్సవ వేడుకలను సర్వం సిద్ధం చేస్తున్నారు. తాజాగా అయోధ్యలోని రామ మందిరంపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. మియాందాద్ చేసిన ఈ  వ్యాఖ్యలు ఇప్పుడు  పెను వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించేందుకు వెళ్లే హిందువులు ముస్లింలుగా బయటపడతారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మియాందాద్ వ్యాఖ్యలపై ప్రజలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

రామ మందిర ప్రారంభోత్సవానికి రెండు నెలల ముందు ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ రామాలయం గురించి మాట్లాడుతూ.. “భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా మంచి పని చేసారు. ఒక మసీదును దేవాలయంగా మార్చారు. మన మూలాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ గుడికి వెళ్లే వారందరూ ముస్లింలుగా బయటకు వస్తారని తాను నమ్ముతున్నాను. మీరు తప్పు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ విషయాన్నీ ప్రజలు అర్థం చేసుకోవడం లేదంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మియాందాద్ కు చెందిన ఈ వీడియో ఇప్పటి కాదని.. వీడియో మూడేళ్ల కిందటిదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జావేద్ మియాందాద్ ఎవరంటే..

22 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన జావేద్ మియాందాద్ అతి పిన్న వయసు గల క్రికెటర్  ఒకరు. ఆ సమయంలో క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ గా ప్రసిద్ధి. 1992లో పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సభ్యుడు. క్రికెటర్ గా రిటర్మెంట్ తీసుకున్న తర్వాత మియాందాద్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కీలక పదవులు నిర్వహించాడు. మూడుసార్లు పాకిస్తాన్ జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు.

మియాందాద్ వీడియో

ఆగస్ట్ 5, 2020న అయోధ్యలో ‘శ్రీరామ జన్మభూమి ఆలయానికి’ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 22న సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించనున్నారు. ట్రస్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. ఆలయ ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీకి మాత్రమే కాదని అందరికీ హక్కు ఉందని ప్రతిపక్షాలు ఈ విషయంపై  నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

అయోధ్య రామ మందిరం నిర్ణయం

నవంబర్ 9, 2019న ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేయాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలంలో ముస్లింలకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ను, రాముడి జన్మస్థలంలో బాబ్రీ మసీదు అంటూ డిసెంబరు 1992లో 16వ శతాబ్దపు మొఘల్ కాలం నాటి బాబ్రీ మసీదును కూల్చి వేసిన సంగతి తెలిసిందే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..