WHO: ప్రపంచం ముందు మరో ముప్పు.. మనిషితో మాట్లాడం మరచిపోతున్న యువత.. ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులు..
సామాజిక అనుసంధానం లేకపోవడం వల్ల ధూమపానం, అతిగా మద్యం సేవించడం, సోమరితనం, ఊబకాయం, ఒత్తిడికి వంటి ఇబ్బందులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని WHO పరిశోధన చెబుతోంది. ఇది ఆందోళన, నిరాశతో ముడిపడి ఉందని .. గుండె జబ్బుల ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచం కొత్త ముప్పును ఎదుర్కొంటోంది.. ఆ ముప్పు ఒంటరితనం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. WHO ఒంటరితనాన్ని తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా అభివర్ణించింది. రానున్న కాలంలో వృద్ధులు, యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ప్రతి నలుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని నివేదిక వెల్లడించింది.
WHO నివేదిక ప్రకారం తగినంత సంఖ్యలో సామాజిక పరిచయాలు, వ్యక్తులతో కనెక్ట్ కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడమే పెద్ద సమస్యగా మారుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అధిక ఆదాయ దేశాలలో, వృద్ధులు ఎక్కువగా ఒంటరితనంతో బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.
ప్రతి నలుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు
WHO నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. అంతేకాదు ఐదు నుండి 15 శాతం మంది యువకుల్లో సామాజిక ఒంటరితనం సాధారణంగా మారిపోయింది. ఈ గణాంకాల ప్రకారం పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఇంతకంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ సామాజిక సంబంధాలను ప్రోత్సహించడానికి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది అన్ని దేశాలలో పని చేస్తుంది.. ప్రజల ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించింది.
ఒంటరితనంతో ప్రతికూల పరిణామాలు
సామాజిక అనుసంధానం లేకపోవడం వల్ల ధూమపానం, అతిగా మద్యం సేవించడం, సోమరితనం, ఊబకాయం, ఒత్తిడికి వంటి ఇబ్బందులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని WHO పరిశోధన చెబుతోంది. ఇది ఆందోళన, నిరాశతో ముడిపడి ఉందని .. గుండె జబ్బుల ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలు
WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఒంటరితనం అధికమైందని.. ఈ ఒంటరితనంతో తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని.. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. బలమైన సామాజిక సంబంధాలు లేని వ్యక్తులు స్ట్రోక్, ఆందోళన, చిత్తవైకల్యం, నిరాశ, ఆత్మహత్య వంటి భావాలకు గురయ్యే ప్రమాదం ఉంది. WHO కమీషన్ సామాజిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేస్తూ.. మనిషి మనిషితో పరిచయాన్ని పెంచుకోవాలని .. ఇతరుల మంచి విషయాల్లో జోక్యం చేసుకోవాలని అది మానసిక వికాసానికి సాయం చేస్తుందని ఆయన అన్నారు.
కమిషన్ ఏమి చేస్తుందంటే..
WHO ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌లో అమెరికన్ సర్జన్ జనరల్ డాక్టర్. వివేక్ మూర్తి , ఆఫ్రికన్ యూనియన్ యూత్ ఎన్వోయ్, చిడో ఎంపెంబాతో సహా 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిషన్ మూడేళ్లపాటు అన్ని వయసుల వ్యక్తుల సామాజిక సంబంధాలను పెంచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. సామాజిక పరిచయాలను చేసుకునే విధంగా పరిష్కారాలను వివరిస్తుంది. అంతేకాదు కీలకమైన సంఘాలు, సమాజం అభివృద్ధి కోసం సామాజిక సంబంధాలు ఎలా పని చేస్తాయో కూడా ఈ కమిషన్ నిర్ణయిస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..