Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagulapalli Maanas: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మానస్.. స్టేజ్ మీద వెడ్డింగ్ డేట్‌ను ప్రకటించిన రాజ్..

మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం. అందరికీ సుపరిచితమైన మానస్ తెలుగు బిగ్ బాస్ తో మరింత పేరు తెచ్చుకున్నాడు. తాజాగా బ్రహ్మ ముడి సీరియల్ లో రాజ్ గా బుల్లి తెర తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరోగా మారాడు. అయితే మానస్ కు ఇటీవలే నిశ్చితార్ధం అయింది. మానస్ కు కాబోయే భార్య పేరు శ్రీజ. 

Nagulapalli Maanas: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మానస్.. స్టేజ్ మీద వెడ్డింగ్ డేట్‌ను ప్రకటించిన రాజ్..
Nagulapalli Maanas
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2023 | 9:43 AM

త్వరలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. హీరో మానస్ తన పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించాడు.  హీరో మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం. అందరికీ సుపరిచితమైన మానస్ తెలుగు బిగ్ బాస్ తో మరింత పేరు తెచ్చుకున్నాడు. తాజాగా బ్రహ్మ ముడి సీరియల్ లో రాజ్ గా బుల్లి తెర తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరోగా మారాడు. అయితే మానస్ కు ఇటీవలే నిశ్చితార్ధం అయింది. మానస్ కు కాబోయే భార్య పేరు శ్రీజ.

ఇటీవల జరిగిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో భాగంగా అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ మేల్ కేటగిరీలో రాజ్ పాత్రకు గాను మానస్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. తనకు కాబోయే భార్య శ్రీజను అందరికి పరిచయం చేశాడు. తమది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. తనకు అర్ధం చేసుకునే భార్య వస్తే చాలు అనుకున్నా.. ఆ లక్షణాలు శ్రీజలో ఉన్నాయి.. అందుకే శ్రీజతో పెళ్ళికి అంగీకరించినట్లు వెల్లడించాడు. అంతేకాదు తమ పెళ్లి నవంబర్ 22న జరగనుందని పెళ్లి తేదీని అందరి సమక్షంలో వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు తాను ఫ్యామిలీ మెన్ కాబోతున్నాను అన్న ఫీలింగ్ తనకు  చాలా బాగుందని..  ఈ గుడ్ న్యూస్ ని మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా బాగుందని తన మనసులో మాటలని అందరితోనూ పంచుకున్నాడు మానస్.

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా తన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు మానస్ నాగులపల్లి.  స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింట్తో దూసుకుపోతోంది.  సీరియల్కు చాలామంది  రాజ్ పాత్రలో కోపం, ప్రేమ, అమాయకత్వం హీరోఇజం ఇలా అన్ని ఎమోషన్స్ ని తనదైన చూపిస్తూ మానస్ మరింతగా అభిమానులకు దగ్గరయ్యాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..