Brahmamudi, November 18th episode: అరుణ్, స్వప్నలను చూసేసిన రాజ్.. వార్నింగ్ ఇచ్చిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య వయ్యారంగా బెడ్ పై కూర్చొని కథ చదువుతూ ఉంటుంది. ఇది విన్న రాజ్ బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. కావ్య శృంగార నైషథం చదువుతుంటే.. చిరాకు పడుతూ ఉంటాడు. ఆ చిరాకుతో కావ్యని బెడ్ పై నుంచి తోసేస్తాడు రాజ్. కానీ ఇదేమీ పట్టించు కోకుండా కోకుండా కావ్య కథ చదువుతూనే ఉంటుంది. రాజ్ చిరాకుతో పుస్తకాన్ని పైకి విసురుతాడు. అది కూడా వచ్చి రాజ్ తలకే తగులుతుంది. అయినా కావ్య శృంగార కథ గురించి మాట్లాడుతూనే ఉంటూ..

Brahmamudi, November 18th episode: అరుణ్, స్వప్నలను చూసేసిన రాజ్.. వార్నింగ్ ఇచ్చిన కావ్య!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 18, 2023 | 11:07 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య వయ్యారంగా బెడ్ పై కూర్చొని కథ చదువుతూ ఉంటుంది. ఇది విన్న రాజ్ బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. కావ్య శృంగార నైషథం చదువుతుంటే.. చిరాకు పడుతూ ఉంటాడు. ఆ చిరాకుతో కావ్యని బెడ్ పై నుంచి తోసేస్తాడు రాజ్. కానీ ఇదేమీ పట్టించు కోకుండా కోకుండా కావ్య కథ చదువుతూనే ఉంటుంది. రాజ్ చిరాకుతో పుస్తకాన్ని పైకి విసురుతాడు. అది కూడా వచ్చి రాజ్ తలకే తగులుతుంది. అయినా కావ్య శృంగార కథ గురించి మాట్లాడుతూనే ఉంటూ.. రాజ్ ని రెచ్చగొడుతుంది. కానీ రాజ్ మాత్రం నీకూ నాకూ మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు.. ఇక ఆ బంధం కూడా ఉంటుందా.. నీకూ నాకూ మధ్య ఎప్పటికీ ఏ బంధం.. సంబంధం ఉండదని రాజ్ ఆవేశంగా అనేసి వెళ్లి పోతాడు. ఎలా ఉండదో నేనూ చూస్తానని కావ్య అంటుంది.

అరుణ్ ని చెడామడా వాయించేసిన స్వప్న:

మరోవైపు స్వప్న తన గదిలో అరుణ్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తప్పులు చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. కానీ ఏ తప్పులూ చేయనప్పుడు ఈ టెన్షన్ ఏంటో అని స్వప్న తల కొట్టుకుంటుంది. అప్పుడే రాహుల్, రుద్రాణిలు అరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వచ్చిన అరుణ్.. రాహుల్ కి కాల్ చేస్తాడు. ఇంటి గేటు తీసుకుని లోపలికి రా.. స్వప్నకి కాల్ చేసి పిలువు వస్తుందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత అరుణ్ స్వప్నకి కాల్ చేసి.. బయటకు రమ్మంటాడు. అరుణ్ కాల్ చేయగానే.. అసలు నీకు బుద్ధి ఉందా? ఫొటోలు ఇంటికి పంపిస్తావా అని అరుస్తుంది. నీతో కలిసి తిరిగినంత మాత్రాన.. నీతో తిరిగినంత మాత్రాన ఫొటోలు ఇంటికి పంపించేస్తావా.. కడుపుకి అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా అని చెడామడా వాయించేస్తుంది స్వప్న.

ఇవి కూడా చదవండి

స్వప్నని బెదిరించిన అరుణ్.. అమ్మో దీనికి క్యారెక్టర్ ఉందన్న రాహుల్:

ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా.. నా ఫొటో నా ఫొటో అంటున్నావేంటి? మనం ఇద్దరం ఉన్న ఫొటోలు కూడా పంపించాను కదా అని అరుణ్ అనగానే.. స్వప్న షాక్ అవుతుంది. అందుకే నేను చెప్పేది పూర్తిగా విను. నేను మీ ఇంటి ముందే ఉన్నాను.. ఒక సారి బయటకు వచ్చి నేను చెప్పేది పూర్తిగా విను అని అంటాడు అరుణ్. ఏంట్రా నేను వచ్చేది.. నా కాపురం నాశనం అయిపోతుందని స్వప్న అంటే.. ఆ ఫొటోలు ఎందుకు పంపించానో తెలుసుకోవాలని లేదా.. అయితే బయటకి రా లేదంటే నేనే లోపలికి వస్తాను అని అరుణ్ అంటాడు. దీంతో స్వప్నే బయటకు వస్తుంది. అరుణ్ ని చూసిన స్వప్న.. చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్తుంది. అరుణ్ ని ఒక్కటి పీకుతుంది స్వప్న. బాబాయ్ ఇది నిజంగానే ఫైర్ బ్రాండ్.. డబ్బు లేక పోయినా క్యారెక్టర్ ఉంది. కానీ మనకు డబ్బు ముఖ్యం కదా అని మరోవైపు రాహుల్ అనుకుంటాడు.

అరుణ్ ని చెంప దెబ్బ కొట్టిన స్వప్న.. అరుణ్, స్వప్నలను చూసేసిన రాజ్:

ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావ్? అని స్వప్న ఫైర్ అవుతుంది. ఈలోపు రాహుల్.. రాజ్ కి కాల్ చేసి బయటకు రమ్మంటాడు. చెప్పు ఎందుకు వచ్చావ్? అని స్వప్న అంటే.. నేరుగా చెప్పేస్తున్నా.. ఐ లవ్ యూ అని అరుణ్ అంటాడు. ఇక బయటకు వచ్చిన రాజ్ ని.. రాహుల్ మాటల్లో పెడతాడు. అయితే ఆలోపే కావ్య బయటకు వస్తుంది. ఇక నా కాపురం చెడగొట్టడానికి.. ఇక్కడికి వచ్చావా అని స్వప్న అంటుంది. నాకు అలాంటి ఆలోచనలు లేవని అరుణ్ అంటాడు. మరోవైపు బయటకు వచ్చిన కావ్య.. ఈ టైమ్ లో అక్కడ ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటుంది. అయితే రాహుల్ అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఏమైంది ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు అని రాజ్ పై నుంచి కిందుకు చూస్తాడు. ఇకపై నువ్వు ఇక్కడికి వచ్చినా.. కలిసినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వెళ్లు అని స్వప్న అంటుంది. ఇక రాజ్ పై నుంచి స్వప్న, అరుణ్ లను చూస్తాడు. ఈ టైమ్ లో స్వప్న ఏంటి ఎవరో అబ్బాయితో మాట్లాడుతుందని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత అరుణ్ అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఇక విషయం ఏంటో తెలుసు కోకుండా తప్పుగా ఆలోచించడం తప్పు అని రాజ్ మనసులో అనుకుంటాడు.

అతను ఎందుకొచ్చాడు.. ఇంకో తప్పు ఏం చేస్తున్నావ్ అని స్వప్నకి క్లాస్ పీకిన కావ్య:

ఇక కావ్య.. స్వప్నని లోపలికి లాక్కెళ్తుంది. ఇదంతా చూసిన రాహుల్, రుద్రాణిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో ఒక సమస్యని నెత్తిన ఏసుకోవడం నీకు సరదా అయిపోయిందేంటి?, అరుణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అది కూడా ఇంత రాత్రి పూట.. అని కావ్య అడుగుతుంది. మాట్లాడటానికి వచ్చాడని స్వప్న అంటే.. నీకేమైనా పిచ్చా.. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా. ఇలా వెళ్లి పాత ఫ్రెండ్స్ ని అర్థరాత్రి కలుస్తున్నావంటే.. ఏమంటారో తెలుసా అని కావ్య అంటుంది. కానీ కలిశాను అంటే పరిస్థితి అలా ఉందనే కదా అర్థం. ఒక్కసారి తప్పు చేశాను కదా అని అన్ని సార్లూ నేనే తప్పు చేశానంటే ఊరుకోను. మరి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని కావ్య అడుగుతుంది. వాడొక పిచ్చోడు.. నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడంట. రాహుల్ నన్ను సరిగ్గా చూసుకోకపోతే.. నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పడానికి వచ్చాడని స్వప్న అంటాడు. ఆ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది. ఇన్నాళ్లూ పట్టించుకోని వాడు ఇప్పుడు ఇంత సడెన్ గా ప్రేమ ఎందుకు గుర్తుకు వచ్చిందని కావ్య నిలదీస్తుంది.

నా తప్పు ఏమీ లేదు కావ్య: స్వప్న

నువ్వు తెలివైన దానివి అనుకుంటావ్ కానీ.. తింగరి దానివి అని నీకు తెలీడం లేదు. నా మీద అరుస్తావ్ అని కావ్య అంటుంది. వాడితో అసలు నేను ఇప్పటి వరకూ మాట్లాడలేదు. సడెన్ గా ఎందుకు వచ్చాడో తెలీదు. పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు అంటున్నాడో అర్థం కావడం లేదు. అందుకే వెళ్లి వార్నింగ్ ఇచ్చాను. ఇందులో నేను ఏ తప్పు కూడా చేయలేదు. అలాంటి చీప్ ఫెలోస్ తో నేను ఎందుకు మాట్లాడతానని స్వప్న అంటుంది. వాడు మళ్లీ వస్తే నాకు చెప్పు. నువ్వు తప్పు చేస్తే.. నాకే కాదు మన అమ్మవాళ్లకు కూడా చుట్టుకుంటుంది. నా కర్మ అని తిట్టుకుని వెళ్లి పోతుంది కావ్య.

అప్పూ కోసం బాధ పడుతున్న కనకం:

ఈ సీన్ కట్ చేస్తే.. కనకం బాధ పడుతూ కూర్చుంటుంది. అప్పుడే కృష్ణ మూర్తి వస్తాడు. కనకం ఏమంది అలా కూర్చున్నావ్ అని అడుగుతాడు. ఇంకా నిద్ర పోకుండా కూర్చున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావ్ అని కృష్ణ మూర్తి అంటాడు. నీతో ఒక విషయం అడగాలి. నీతో చెప్పకూడదు అనుకున్నా కానీ.. నీ దృష్టిలో ఇంకో నేరం చేసిన దాన్ని అవుతా అని కనకం అంటే.. ఏంటే మళ్లీ ఏమైందని కృష్ణ మూర్తి అంటాడు. మళ్లీ సమస్య మొదలైందని కనకం ఏడుస్తూ చెబుతుంది.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..