Bigg Boss 7 Telugu: ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్.. అసలు ఆట ఏమైనా ఆడారా ?.. బిగ్‌బాస్ వీకెండ్ ప్రోమో..
ఈవారం హౌస్ కెప్టెన్‌గా ప్రియాంక గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం వారం మొత్తం బాల్ బ్యాలెన్సింగ్ టాస్కులే జరిగాయి. అన్ని టాస్కులలో అందరిని డిఫైండ్ చేసి చివరకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు యావర్. ఇక తాజాగా ఈ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈవారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నామినేషన్స్ షుగర్ బాల్స్ పగలగొడుతూ ప్రతి ఒక్కరి తప్పులు ఎత్తిచూపాడు. ప్రోమోలో ముందుగా సీసా తల మీద బద్దలుకొట్టి చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటూ ఒక్కొక్కరి ఫోటోపై షుగర్ బాటిల్స్ పగలగొట్టేశాడు.
బిగ్‌బాస్ సీజన్ 7 కేవలం నాలుగైదు వారాల ఆట మాత్రమే మిగిలుంది. ఇప్పటివరకు పదివారాలు పూర్తి కాగా.. ఇప్పుడు 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈవారం హౌస్ కెప్టెన్‌గా ప్రియాంక గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం వారం మొత్తం బాల్ బ్యాలెన్సింగ్ టాస్కులే జరిగాయి. అన్ని టాస్కులలో అందరిని డిఫైండ్ చేసి చివరకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు యావర్. ఇక తాజాగా ఈ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈవారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నామినేషన్స్ షుగర్ బాల్స్ పగలగొడుతూ ప్రతి ఒక్కరి తప్పులు ఎత్తిచూపాడు. ప్రోమోలో ముందుగా సీసా తల మీద బద్దలుకొట్టి చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటూ ఒక్కొక్కరి ఫోటోపై షుగర్ బాటిల్స్ పగలగొట్టేశాడు.
ముందు శివాజీ ఫోటోపై సీసా పగలగొట్టి.. నాకు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పడంతో.. అప్పుడప్పుడు వచ్చే బూతులా అండి అంటూ అడిగాడు శివాజీ. అవునంటూనే.. ఈ విషయంలో నీ సహనం ఏమైందీ ? ఈ విషయంలో నీ అనుభవం ఏమైందీ ? ఈ విషయంలో నీ సమర్ధత ఏమైందీ ? ఏర్రీ పోహా.. పిచ్చి పోహా.. ఇవన్నీ హౌస్ లో మాట్లాడే పదాలేనా శివాజీ అంటూ సీరియస్ అయ్యారు నాగ్. ఇక ఆ తర్వాత రతిక ఫోటోపై సీసా పగలగొట్టి.. ఈ ఇంట్లో కొన్ని పదాలు బ్యాన్ చేస్తున్నాను. వచ్చే వారం నుంచి నేనెంటో చూపిస్తాను.. నేను ఇక నుంచి ఆడతాను అనే పదాలు ఇంట్లో బ్యాన్ చేస్తున్నానని అన్నారు. అమర్ నువ్వు విన్నర్ అనుకోకపోతే విన్నర్ ఎలా అవుతావు అంటూ మోటివేట్ చేశారు.
చెల్లెల్ని గెలిపించుకోవడం తప్పా.. నువ్వు ఇంకేమైనా చేశావా అంటూ గౌతమ్ కు క్లాస్ తీసుకున్నారు. అసలు ఈ వారం నువ్వేమైనా ఆడావా ?.. ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చేసి నన్ను టాప్ లో పెట్టారు.. ఇక చాలు అనుకున్నావా ?.. లేక వేరేవాళ్లను గెలిపించాలనుకుని ఆడలేదా ? అంటూ ప్రశాంత్‌ను క్వశ్చన్ చేశాడు. ఇక నేరుగా షుగర్ సీసాను చేతిలో పగలగొట్టి అశ్వినికి చుక్కలు చూపించాడు నాగ్. ప్రియాంక నీ తలపై కొట్టినప్పుడు ఏదో నీ తల పగిలిపోయినట్లు చేశావ్. బిగ్ బాస్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోడా అని అశ్విని అడగ్గా.. తల మీద కొంచం గట్టిగానే తగిలిందని చెప్పింది. దీంతో నేను డైరెక్ట్ గా చేతిపై కొట్టుకున్నాను నాకేం కాలేదని నాగ్ అడగ్గా.. ఆ బాటిల్లో ఏమైనా తేడా ఉందేమో అంటూ అశ్విని చెప్పడంతో నవ్వుతూనే ఆమెకు సెల్యూ్ట్ చేయడంతో ప్రోమో ముగిసింది.