Viral Video: ప్రపంచంలో ప్రమాదకమైన గుహ.. ఈ మృత్యుగుహలోకి అడుగు పెడితే మరణం తథ్యం.. రీజన్ ఏమిటఁటే
వీడియోలో ఒక వ్యక్తి భయంకరమైన గుహ దగ్గర ఉన్నాడు. ఆ గుహ నలుపు రంగులో ఉంది. అక్కడ ఒక వ్యక్తి వెలుగుతున్న కాగడా పట్టుకుని వెళ్ళాడు. భగభగా మండుతున్న కాగడాను గుహ దగ్గరగా తీసుకుని వెళ్లి మొదట గుహ పైభాగంలో కాగడాను కదిలించాడు. అనంతరం అతను ఆ కర్రను గుహ కిందకు తీసుకెళ్లిన వెంటనే, మంటలు త్వరగా ఆరిపోయాయి. అంటకాదు చిక్కటి పొగ అక్కడ వ్యాపించింది
ఈ భూమిపై చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.. ప్రకృతి రమణీయత ఎవరినైనా మంత్రముగ్దులను చేస్తుంది. అదే సమయంలో చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను గుర్తు చేసుకున్నా.. వెళ్లాలన్నా జనం భయపడతారు. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశం కోస్టారికాలో ఒకటి ఉంది. ఇది సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ ప్రాంతంలో ఉంది.దీనిని ‘కేవ్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. ఈ గుహలోపల కార్బన్ డయాక్సైడ్ వాయువుల కొలను ఉందని పేర్కొన్నారు. ఈ వాయువు చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనది అంటే ఎవరైనా గుహలోకి ప్రవేశిస్తే మరణిస్తారు. ఈ వాయువు తగిలిన వెంటనే మంటలు క్షణంలో ఆరిపోతాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఒక వ్యక్తి భయంకరమైన గుహ దగ్గర ఉన్నాడు. ఆ గుహ నలుపు రంగులో ఉంది. అక్కడ ఒక వ్యక్తి వెలుగుతున్న కాగడా పట్టుకుని వెళ్ళాడు. భగభగా మండుతున్న కాగడాను గుహ దగ్గరగా తీసుకుని వెళ్లి మొదట గుహ పైభాగంలో కాగడాను కదిలించాడు. అనంతరం అతను ఆ కర్రను గుహ కిందకు తీసుకెళ్లిన వెంటనే, మంటలు త్వరగా ఆరిపోయాయి. అంటకాదు చిక్కటి పొగ అక్కడ వ్యాపించింది. దీని తరువాత మళ్ళీ కర్రకు నిప్పంటించాడు.. గుహ ఉపరితలం దగ్గరికి తీసుకువెళ్ళాడు.. మళ్ళీ అదే సంఘటన మళ్లీ జరిగింది. ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన.
La Cueva de la Muerte en Costa Rica. Una de las características más notables de la cueva es el charco de dióxido de carbono en el suelo, que es notablemente estable y contiene casi un 100% de CO2. Cualquier pequeño animal que entre se desmaya y muere. pic.twitter.com/cMVWqBJmOl
— escribano (@tuidelescribano) November 16, 2023
ఈ ఆశ్చర్యకరమైన వీడియో @Rainmaker1973 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 56 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 36 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.
అదే సమయంలో వీడియో చూసిన తర్వాత వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. అందులో కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఉందని తెలుసుకుని కొందరు ఆశ్చర్యపోతుండగా, ‘ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో చూపిన విషయాలు వాస్తవం అని టీవీ9 ధృవీకరించడం లేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..