- Telugu News Photo Gallery Miss Universe 2023: When And Where To Watch? Who Is Representing India total details here
Miss Universe 2023: రేపే మిస్ యూనివర్స్ పోటీలు.. మనదేశం నుంచి ఎవరు ప్రాతినిథ్యం వహించనున్నారంటే..
నేటి తరం అమ్మాయి అందాన్ని పోల్చాలంటే.. మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ వంటి టైటిల్ తో పోలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యాషన్, అందంపై ఆసక్తి ఉన్నవారు మిస్ యూనివర్స్ వంటి పోటీల ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన అతిపెద్ద ఈవెంట్‌లో దాదాపు 84 దేశాలు పాల్గొంటున్నాయి. 72వ మిస్ యూనివర్స్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు.. భారత దేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Nov 18, 2023 | 10:00 AM

మిస్ యూనివర్స్ 2023 రేపు అంటే నవంబర్ 18న నిర్వహించనున్నారు. చాలా దేశాలు ఫ్యాషన్, అందానికి సంబంధించిన ఈ అతిపెద్ద ఈవెంట్‌లలో పాల్గొంటున్నాయి. భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న యువతికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

పోటీ ఎక్కడ జరుగుతుందంటే: ఈసారి మిస్ యూనివర్స్ పోటీలను సాల్వడార్‌లో నిర్వహిస్తున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన అనుభవజ్ఞులు ఫ్యాషన్ షో రాజధానిగా పేరు గాంచిన శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో ఈవెంట్ జరగనుంది.

ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే : నివేదికల ప్రకారం, ఈ ఫ్యాషన్ షోలో 84 దేశాలు పాల్గొంటున్నాయి. దాదాపు 13000 మంది ఈ షోను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ వేషధారణ పోటీలు జరిగాయి.

సమయం ఏమిటి : ఈ ఈవెంట్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం, వీక్షకులు ఉదయం 6 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడగలరు.

భారతదేశం నుండి శ్వేతా శారదా : 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మన దేశం నుంచి శ్వేతా శారదా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2023లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2023 మిస్ దివా యూనివర్స్ శ్వేత చండీగఢ్‌కు యువతి. ప్రసిద్ధ నృత్యకారిణి కూడా. అంతేకాదు శ్వేత డాన్స్ ప్లస్‌తో సహా అనేక షోలలో కూడా భాగమైంది.





























