Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్‌లో అగ్నికి ఆహుతైన కారు.. ప్రయాణికుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం..
రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రయాణికులు చాకచక్యంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారు షార్ట్ సర్క్యూటే వళ్లే మంటలు వ్యాపించి.. ప్రమాదానికి కారణమని ప్రయాణికులు భావిస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటలతో దగ్ధమైంది. ఈ డస్టర్ కారు డోర్నాల నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్తోంది. ఈ సమయంలో ఘాట్ రోడ్డులో హఠాత్తుగా కారులో పొగలు రావడం మొదలయ్యాయి. ఇది కారులో ఉన్న ప్రయాణీకులు గమనించిన .. అప్రమైతమయ్యారు. వెంటనే కారు పక్కకు అపి కారునుంచి దిగిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతైంది.
ప్రయాణికులు చాకచక్యంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారు షార్ట్ సర్క్యూటే వళ్లే మంటలు వ్యాపించి.. ప్రమాదానికి కారణమని ప్రయాణికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. అగ్నికి ఆహుతైన కారు పొరుమామిళ్లకి చెందిన గాలి మురళి మోహన్ దిగా గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..