- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for wealth: keep these vastu these idols at home to bring success wealth and prosperity in telugu
Vastu Tips: ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఉంచండి.. ఏ దిశలో ఉంచాలంటే
వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాదు.. సానుకూల శక్తిని పెంపొందించడానికి దేవీ దేవతలతో సహా అనేక విగ్రహాలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కొన్ని విగ్రహాలు ఇంటి అందాన్ని పెంచడమే కాదు కుటుంబ సభ్యుల అదృష్టాన్ని కూడా ప్రకాశవంతం చేస్తాయని నమ్ముతారు. ఇంట్లో తరచుగా కష్టాలు ఎదురవుతున్నట్లయినా.. లేదా ధనాన్ని కోల్పోవాల్సి వచ్చినా వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంట్లో కొన్ని రకాల విగ్రహాలను లేదా వాటిల్లో ఏదొకదానిని ప్రతిష్టించవచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో ఏ విగ్రహాలను ఉంచడం ద్వారా కష్ట, నష్టాల నుండి ఉపశమనం పొందవచ్చునో తెలుసుకుందాం.
Updated on: Nov 18, 2023 | 8:10 AM

తాబేలు విగ్రహం: వాస్తు ప్రకారం ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌కు ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది డబ్బు ప్రవాహాన్ని పెంచుతుందని .. విజయ మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుందని విశ్వాసం. అంతేకాదు ఇంట్లోని సభ్యులు ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్మకం.

కామధేను ఆవు: హిందూ మతంలో గోవును గోమాతగా పూజిస్తారు. గౌరవిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఇత్తడి ఆవు దూడ విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం.

చేప: వాస్తు ప్రకారం లోహపు చేపను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. దీంతో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సంపదను పెంచుకోవడానికి, ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఉంచవచ్చు.

జంట హంసలు: వాస్తు ప్రకారం హంసల జంట విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడిచిపోతుంది. వైవాహిక జీవితంలో సమస్యలను అధిగమించడానికి.. బెడ్ రూమ్ లో జంట హంసలను ఉంచవచ్చు.

ఏనుగు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది ఇంట్లో సంపద, శ్రేయస్సును పెంచుతుంది. సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది.




