Eisenmenger syndrome: తల విపరీతంగా పెరిగిన 3 ఏళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స.
గుంటూరు జిల్లాలోని ఓ చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు వైద్యులు. తల విపరీతంగా పెరిగిపోతూ, గుండెసైతం పూర్తిగా ఏర్పడక ప్రాణాంతక స్థితిలో ఉన్న మూడేళ్ల చిన్నారికి డాక్టర్ పాటిబండ్ల మోహన్‌రావు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కృష్ణా జిల్లాకు చెందిన కైకాల దుర్గా ప్రకాష్ దంపతులకు అభిషిక్త్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాబు పుట్టిన ఆరు నెలల చిన్నారి తల విపరీతంగా పెరగటం ప్రారంభం అయింది.
గుంటూరు జిల్లాలోని ఓ చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు వైద్యులు. తల విపరీతంగా పెరిగిపోతూ, గుండెసైతం పూర్తిగా ఏర్పడక ప్రాణాంతక స్థితిలో ఉన్న మూడేళ్ల చిన్నారికి డాక్టర్ పాటిబండ్ల మోహన్‌రావు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కృష్ణా జిల్లాకు చెందిన కైకాల దుర్గా ప్రకాష్ దంపతులకు అభిషిక్త్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాబు పుట్టిన ఆరు నెలల చిన్నారి తల విపరీతంగా పెరగటం ప్రారంభం అయింది. మొదట సాధారణంగా తీసుకున్న ప్రకాష్ చిన్నారి ఆరోగ్యంలో మార్పులు రావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. పరీక్షలు నిర్విహించిన వైద్యులు తల పెరగడంతో పాటు ఇతర సమస్యలున్నట్లు గుర్తించారు. 40 నుండి 60 సెంటీ మీటర్లు ఉండాల్సిన తల 90 సెంటీ మీటర్లకు పెరిగిపోయింది. దీంతో పాటు గుండెలో కుడి పక్క భాగం పూర్తిగా ఏర్పడలేదు. గుండెలో 10 నుండి 20 వరకూ ఉండాల్సిన ఒత్తిడి శాతం కూడా 138కి పెరిగిపోయింది. కొడుకులో వస్తున్న మార్పులు చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కన్నబిడ్డను బతికించుకునేందుకు ఆస్పత్రుల బాట పట్టాడు.
తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ లో బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు.. ఐసెన్ మెంగర్ సిండ్రోమ్ (Eisenmenger syndrome ) వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా తల పెరగటం, నీరు చేరడంతో పాటు ఎదుగుదల లోపిస్తుంది. మెదడులో ఉన్న లోపంతో పాటు గుండెలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆపరేషన్ చేసినా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో చిన్నారిని తీసుకొని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో్ చూపించారు. ఫలితం లేదు, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి సైతం వెళ్లారు. అక్కడా వైద్యం అందలేదు. శస్త్ర చికిత్స చేసినా ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పడంతో చిన్నారిపై ఆశలు వదులుకున్నారు. అదే సమయంలో గుంటూరులోని రావూస్ ఆసుపత్రి గురించి దుర్గా ప్రకాష్ కి తెలిసింది. వెంటనే చిన్నారిని తీసుకొని రావూస్ ఆస్పత్రిలోని వైద్యులకు చూపించారు. చిన్నారి కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న డాక్టర్ పాటిబండ్ల మోహన్‌రావు చిన్నారికి ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అందుకు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దుర్గాప్రకాష్ ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్ మోహన్‌రావు ఉచితంగా చిన్నారికి ఆపరేషన్ చేశారు. చిన్నారి మెదడులో స్టంట్ వేశారు. దాదాపు 5 గంటలపాటు ఆపరేషన్ చేసి అభిషిక్త్‌కు మెదడులో స్టంట్ వేశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అరుదైన శస్త్రచికిత్సతో చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులకు దుర్గాప్రకాష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

