Telangana: సర్టిఫికెట్లు మిస్ చేసిన పోస్టాఫీస్ సిబ్బంది.. అమెరికా వెళ్లే చాన్స్ కోల్పోయానని యువకుడు ఆవేదన
ఖమ్మం పోస్ట్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యానికి లండన్‌లో చదువుకున్న ఖమ్మం విద్యార్థి సాయి రాహుల్ జీవితం.. ఒక్కసారిగా తల్లకిందులై పోయింది. పోస్టాఫీస్ సిబ్బంది నిర్వాకంతో సాయి రాహుల్ సర్టిఫికేట్ లు మిస్ అయ్యాయి. నగరానికి చెందిన సాయి రాహుల్ లండన్ లోని ఓ యూనివర్సిటీ లో మాస్టర్స్ పరీక్షలు రాసి ఖమ్మం వచ్చాడు.
ఒకోక్కసారి చిన్న చిన్న నిర్ణయాలు, కొంచెం నిర్లక్ష్యం కూడా కొందరు భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. తాజాగా పోస్టాఫీసు సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడి భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. వాళ్లు సర్టిఫికెట్లను మిస్ చేయడంతో అమెరికా వెళ్లే చాన్స్ కోల్పోయానని ఆ యువకుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం పోస్ట్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యానికి లండన్‌లో చదువుకున్న ఖమ్మం విద్యార్థి సాయి రాహుల్ జీవితం.. ఒక్కసారిగా తల్లకిందులై పోయింది. పోస్టాఫీస్ సిబ్బంది నిర్వాకంతో సాయి రాహుల్ సర్టిఫికేట్ లు మిస్ అయ్యాయి. నగరానికి చెందిన సాయి రాహుల్ లండన్ లోని ఓ యూనివర్సిటీ లో మాస్టర్స్ పరీక్షలు రాసి ఖమ్మం వచ్చాడు. అతడికి వీలు కుదరక ఆగస్టులో సర్టిఫికెట్స్ అందించే కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో సర్టిఫికెట్స్ ఇతర ధ్రువపత్రాలు అక్కడి యూనివర్సిటీ వాళ్లు పోస్ట్ ద్వారా ఖమ్మంలోని సాయి అడ్రస్‌కు పంపించారు.
కవర్ ఖమ్మం కలెక్టరేట్‌లోని పోస్ట్ ఆఫీస్‌కు చేరినట్టు ట్రాకింగ్ చూపిస్తున్నప్పటికీ తమకు రాలేదని సిబ్బంది చెబుతున్నారనంటూ సాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. పోస్టల్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటని అతడు వాపోతున్నాడు. ఆ సర్టిఫికెట్స్ ఆధారంగా వచ్చే నెల అమెరికా వెళ్లాల్సి ఉందని.. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నాడు సాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..