SSC JE Results 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 పేపర్-1 ఫలితాలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్-1 పరీక్షలో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కమిషన్ పేర్కొంది. పేపర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారందరూ పేపర్-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్-బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో ఉద్యోగాలు..
న్యూఢిల్లీ, నవంబర్ 17: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్-1 పరీక్షలో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కమిషన్ పేర్కొంది. పేపర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారందరూ పేపర్-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్-బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో ఉద్యోగాలు పొందుకుంటారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు కింద నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. పేపర్-1, పేపర్-2 ఆన్‌లైన్ రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకారవేతనాలకు దరఖాస్తులు.. ఎవరెవరు అర్హులంటే
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనం అందించడానికి ప్రతిభ గల విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)కు ప్రతీ యేట మాదిరి గానే ఈ ఏడాది కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జీఈఎస్‌టీ-2024 డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జీఈఎస్‌టీ-2024 పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తారు. ఎన్టీఆర్ బాలికల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసేవరకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 షార్ట్ టర్మ్ కింద 3 నెలలు కోర్సులను ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం కనకారావు తెలిపారు. పదో తరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సొల్యూషన్స్, ప్లంబర్ జనరల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన విద్యార్థులకు బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామన్నానరు. కోర్సు శిక్షణ కాలం పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లు అందిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 0866-2475575, 77804-29468, 91825-34259 సంప్రదించాలని సూచించారు
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.