ఓరీ దేవుడో.. విమానంలో గుర్రం హల్‌చల్‌.. 31వేల అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెంపుకుని..పైలట్‌ ఏం చేశాడంటే..

లైవ్ ఏటీసీకి అందిన రికార్డింగ్‌లో పైలట్ ఇలా చెప్పడం వినిపించింది. అవును సార్, ఇది కార్గో విమానం. మా విమానంలో ఒక జంతువు ఉంది. అది గుర్రం. అది దాన్ని కట్టేసిన స్థలం నుండి తప్పించుకుంది..విమానం టేకాఫ్‌ సమయంలో ఎటువంటి సమస్య ఎదురుకాలేదు.. కానీ  విమానం గాల్లో ఉండగా గుర్రం తప్పించుకుందని చెప్పారు. తాము దానిని తిరిగి కట్టేయలేకపోయామని టెన్షన్ పడుతూ చెప్పారు..  అందుకే మేము తిరిగి వెనక్కి వెళ్ళవలసి ఉంటుందని అతడు గట్టిగా చెప్పటం వినిపించింది. ప్రస్తుతం ఈ వార్తల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓరీ దేవుడో.. విమానంలో గుర్రం హల్‌చల్‌.. 31వేల అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెంపుకుని..పైలట్‌ ఏం చేశాడంటే..
Horse Escapes
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 18, 2023 | 12:16 PM

ఇటీవల తరచూగా విమానాల్లో అంతరాయం, విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపం వంటి సమస్యలు అనేకం వార్తల్లో వింటున్నాం. అలాంటి సమయాల్లో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ చేయటం జరుగుతుంది. పలు సందర్భాల్లో విమానంలో ఆటంకం ఏర్పడినప్పుడు, ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించినప్పుడు లేదా ప్రయాణికుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి ఉంటుంది. అయితే తాజాగా ఓ విమానం అత్యవసరంగా వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. న్యూయార్క్ నుండి బెల్జియంకు బయలుదేరిన బోయింగ్ 747 కార్గో విమానం అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించింది. పైలట్ అనౌన్స్‌ చేస్తూ..ఒక గుర్రం దాని స్టాల్ నుంచి తప్పించుకుని వచ్చింది..మేము దానిని అదుపు చేయలేకపోయారు.. మేము వెంటనే తిరిగి వెళ్లాలి అంటూ హంగామా సృష్టించాడు. విమానంలో గుర్రమా అనే కదా మీ సందేహం.. అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

లైవ్ ఏటీసీకి అందిన రికార్డింగ్‌లో పైలట్ ఇలా చెప్పడం వినిపించింది. అవును సార్, ఇది కార్గో విమానం. మా విమానంలో ఒక జంతువు ఉంది. అది గుర్రం. అది దాన్ని కట్టేసిన స్థలం నుండి తప్పించుకుంది..విమానం టేకాఫ్‌ సమయంలో ఎటువంటి సమస్య ఎదురుకాలేదు.. కానీ  విమానం గాల్లో ఉండగా గుర్రం తప్పించుకుందని చెప్పారు. తాము దానిని తిరిగి కట్టేయలేకపోయామని టెన్షన్ పడుతూ చెప్పారు..  అందుకే మేము తిరిగి న్యూయార్క్‌కు వెళ్ళవలసి ఉంటుందని అతడు గట్టిగా చెప్పటం వినిపించింది. ప్రస్తుతం ఈ వార్తల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విమానంలోకి గుర్రం ఎలా ప్రవేశించిందంటూ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే…

విమానంలోకి గుర్రం ఎలా వచ్చింది..?

ఇవి కూడా చదవండి

అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇది ప్రయాణీకుల విమానం కాదు.. జంతువులు, గుర్రాలను కూడా సాధారణంగా రవాణా చేసే కార్గో విమానం అని పైలట్ సందేశం ద్వారా స్పష్టమైంది. ఈ గుర్రం ఒకటి దాన్ని కట్టేసిన చోటు నుండి తప్పించుకోవడంతో విమానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్లైట్‌రాడార్ 24 డేటా బోస్టన్ తీరం నుండి యు-టర్న్ చేయవలసి రావడానికి ముందు విమానం 31,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలిసింది. ఆ వెంటనే విమానం ల్యాండింగ్‌కు భద్రతా బరువు పరిమితిని మించకుండా చూసేందుకు, విమానం నుండి సుమారు 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ మీదుగా కిందకు విసిరినట్లు ఆడియోలో చెప్పటం కూడా వినిపించింది. న్యూయార్క్‌లోని JFK ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడు పశువైద్యుడు అక్కడ ఉన్నారో లేదో కూడా నిర్ధారించుకోవాలని కూడా పైలట్ చెప్పడం వినిపించింది. తదనంతరం, ల్యాండింగ్ అయిన తర్వాత, ఒక కంట్రోల్ టవర్ ఉద్యోగి తనకు సహాయం కావాలా అని పైలట్‌ను అడిగాడు. అతను మైదానంలో కాదు, ర్యాంప్‌పై అవసరమని బదులిచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..