AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మేము సైతం.. ఎన్నికల ప్రచారంలో మహిళల హవా.. ఎమ్మెల్యే అభ్యర్థి కోసం గల్లీ గల్లీలో జోరుగా..

Telangana: రాష్ట్ర  వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటి చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు.  రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా  మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలెక్షన్ కమీషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులోనూ రూరల్ లెవెల్లో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

Hyderabad: మేము సైతం.. ఎన్నికల ప్రచారంలో మహిళల హవా.. ఎమ్మెల్యే అభ్యర్థి కోసం గల్లీ గల్లీలో జోరుగా..
Election Campaign
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 9:10 AM

Share

హైదరాబాద్,నవంబర్ 18; హైదరాబాద్,నవంబర్ 18; రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొంది. పొలిటికల్ పార్టీలు పోటీ పడి ప్రచారాలతో దూసుకుపోతోన్నాయి. ఓటర్ దేవుళ్ల ను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు.  తమ సొంత నియోజక వర్గాల్లో అభ్యర్థులు ప్రచారాల స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం తమ భార్యలు క్యాంపెయిన్స్ లో చురుక్కగా పాల్గొంటున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటూ.. మహిళా కార్యకర్తలు సైతం క్యాంపెయిన్స్ లో తిరుగుతున్నారు.తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ నెలకొంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో వారి నియోజక వర్గాల్లో ప్రచారల స్పీడ్ పెంచారు. ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సొంత నియోజక వర్గాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఆయా పార్టీల అభ్యర్థులకు క్యాంపెయిన్స్ లో తోడుగా తమ సతీమణులు కూడా ప్రచారాల్లో నిలుస్తున్నారు. గెలుపు కోసం తమ వంతుగా ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీరితో పాటూ మహిళా కార్యకర్తలు సైతం ప్రచారాలతో సందడి చేస్తున్నారు.

– రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటి చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు.  రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా  మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలెక్షన్ కమీషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులోనూ రూరల్ లెవెల్లో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.  వారిని ఆర్షించడంతో పాటూ…ఎమ్మెల్యే క్యాండేట్స్ క్యాంపెయిన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రచారాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీఎస్ పీ, బీజేపి పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు జిల్లాల్లో తిరుగుతూ ప్రచారాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

– ప్రధాన పార్టీల లీడర్ల ప్రచారాలతో పాటూ నియోజవర్గాల్లో నెల కొన్న సమస్యలు తెలుకోవడం, ఓటర్ల నాడి పట్టుకోవడంలో మహిళల క్యాంపెయిన్ సెంటింమెంట్ గా ఉపయోగపడుతోంది. బై ఎలక్షన్స్ టైమ్ లోనూ లీడర్ల కుటుంబ సభ్యులు  ఇంటింటి ప్రచారాల్లో పాల్గొన్నారు. BRS పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం మహిళలను ఆకట్టుకునేందుకు మహిళలే టార్గెట్ గా మెనిఫెస్ట్ ల్లో 500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహా లక్ష్మి పేరుతో మహిళలకు 2500 ఆర్థిక సాయం వంటి గ్యారెంటీలను మహిళ ఓటర్లకు వివరిస్తున్నారు.  అధికార పార్టీ కల్యణా లక్ష్మి, న్యూ ట్రీషన్ కిట్, గర్బీణీలకు కేఆర్ కిట్టు, ఒంటరి మహిళలకు అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. అయితే గ్రామాలు, మండల స్థాయిల్లో నిర్వహించే ప్రచారల్లో ఎక్కువగా మహళలు పాల్గొంటున్నారు.

– ఎన్నికల ప్రచారల్లో మహిళ, వృద్దుల ఓటర్లను ఆకట్టుకునేలా మహిళ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. ఒకప్పుడు ప్రజాధరణ ఉన్న పార్టీ లీడర్లు, సెలెబ్రెటీ ప్రచార కర్తలు క్యాంపెయిన్స్ లో కీలకంగా పాల్గొనే వారు. ఇప్పుడు అభ్యర్థుల సతీమణులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున  అభ్యర్థుల తరుపున ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఒకప్పటి రాజకీయలతో పోల్చితే ఏటేటా పాలిటిక్స్ లో మహిళ పార్టిసీపేసన్ పెరుగుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..