Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఇవాళ అమిత్‌ షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు.. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సకల జనుల సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే కేంద్రహోమంత్రి శుక్రవారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉండగా.. ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి.

Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
BJP National leaders are campaigning with the aim of winning the Telangana elections
Follow us
Srikar T

|

Updated on: Nov 18, 2023 | 10:36 AM

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఇవాళ అమిత్‌ షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు.. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సకల జనుల సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే కేంద్రహోమంత్రి శుక్రవారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉండగా.. ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. మధ్యాహ్నం 1.35 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు.

ఆ తరువాత మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ సభలో పాల్గొంటారు అమిత్‌షా. సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ సభలు అన్నీ పూర్తయ్యాక సాయంత్రం 6 గంటలకు తిరిగి బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు. సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..