AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ.. ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు నష్టపోతారు..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడు నాలుగు సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో.. సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. అయితే... కరీంనగర్‌, చొప్పదండి, హుజురాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో అనేక కొత్త అంశాలను టచ్‌ చేశారు.

CM KCR: బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ.. ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు నష్టపోతారు..
Cm Kcr
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2023 | 9:57 PM

Share

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడు నాలుగు సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో.. సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. అయితే… కరీంనగర్‌, చొప్పదండి, హుజురాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో అనేక కొత్త అంశాలను టచ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ అన్నారు కేసీఆర్‌. తెలంగాణలోని అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. మతం పేరుతో రాజకీయాలుచేసే బీజేపీకి, కర్ఫ్యూలతో కల్లోలం సృష్టించే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతుందని హెచ్చరించారు కేసీఆర్‌. రైతులు, కరెంట్‌, ధరణి… ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు గులాబీ బాస్‌. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్‌… రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు.

కాగా.. హుజురాబాద్‌ సభలో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌ టార్గెట్‌గా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పాలిచ్చే ఆవును కాదని, ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని, అదే వేరేటోళ్లకు వేస్తే ఓటు మురిగిపోతుందన్నారు. హుజురాబాద్‌ ప్రజలు.. గతంలో ఓసారి తనను బాధపెట్టారని, ఈసారి ఆ తప్పు చేయొద్దన్నారు కేసీఆర్‌.

వీడియో చూడండి..

కేసీఆర్‌ తనతో కన్నీళ్లు పెట్టించారని, గజ్వేల్‌లో ఓడించి బదులు తీర్చుకుంటానంటూ పోటీకి దిగారు ఈటల. గజ్వేల్‌తోపాటు సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌ బరిలోనూ నిలిచారు. అయితే, ఈటలను అతని సొంత నియోజకవర్గంలోనే ఓడించి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్‌. దాంతో, అటు గజ్వేల్‌లో, ఇటు హుజురాబాద్‌లో ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!