Telangana: ‘రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్’.. నేడే బీజేపీ మేనిఫెస్టో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించగా.. టీబీజేపీ 'గేమ్ చేంజర్'గా తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలకు ధీటుగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కమలనాథులు మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించగా.. టీబీజేపీ ‘గేమ్ చేంజర్’గా తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలకు ధీటుగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కమలనాథులు మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం.
తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ మోదీ గ్యారంటీ నినాదంతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. నారీ శక్తి పేరిట అమలు చేస్తున్న పథకంలో భాగంగా ప్రతీ వివాహితకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందిస్తామని హామీ ఇవ్వబోతోంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించనుంది. కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే హామీ కూడా ఇవ్వనుంది.యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీ జాబ్ క్యాలెండర్, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం హామీ ఇస్తారని తెలుస్తోంది. ప్రతి వ్యక్తికి జీవిత భీమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇళ్లు హామీని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఐఐటి ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు, ఫ్రీ విద్యుత్ పథకం రజక, నాయిబ్రాహ్మణులకు వర్తింపచేస్తామని హామీ ఇవ్వనున్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుపై కూడా హామీ ఇవ్వనున్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేయనున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల భూములు లాక్కుని పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ప్రచారం చేస్తున్న కమలనాథులు తమ మ్యానిఫెస్టోలో దానికి ప్రత్యామ్నాయం చూపుతారని అంతా భావిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఎన్నికలు ఉండటంతో బీజేపీ గేమ్ చేంజర్‌గా మేనిఫెస్టోను రూపొందించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలో సుపరిపాలన, పేదల సంక్షేమం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ @AmitShah గారు.#TelanganaWithBJP pic.twitter.com/RJIdQqAtnh
— BJP Telangana (@BJP4Telangana) November 17, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..