Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Gaza: దక్షిణ గాజా నుంచి పారిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు

South Gaza: దక్షిణ గాజా నుంచి పారిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు

Anil kumar poka

|

Updated on: Nov 18, 2023 | 8:08 PM

హమాస్‌ ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌.. తాజాగా దక్షిణ గాజాపై ఫోకస్‌ పెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌ (IDF).. పౌరులు వెంటనే అక్కడినుంచి తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు.

హమాస్‌ ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌.. తాజాగా దక్షిణ గాజాపై ఫోకస్‌ పెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌ (IDF).. పౌరులు వెంటనే అక్కడినుంచి తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. కానీ.. ఎదురుకాల్పుల్లో పౌరులు ఎవరూ చిక్కుకోకూడదని, వారికి ఎలాంటి హానీ కలగకూడదని తాము భావిస్తున్నాం అంటూ ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దక్షిణ గాజా నగరమైన ఖాన్‌ యూనిస్‌లో 4లక్షల వరకు జనాభా ఉంటారు. దీనికి తోడు.. ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడటంతో అనేక మంది దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారు. ఇప్పుడు వీరందరినీ పశ్చిమ ప్రాంతానికి తరలి వెళ్లాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు చేసింది. అక్కడైతే మానవతా సాయం పొందేందుకు సులువుగా ఉంటుందని పేర్కొంది. దీంతో మళ్లీ వలసబాట పట్టక తప్పేలా లేదని పాలస్తీనీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

శనివారం తెల్లవారుజామున ఖాన్‌ యూనిస్‌ నగరంలోని ఓ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది మరణించినట్లు పాలస్తీనా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాయి. మరోవైపు, ఉత్తర గాజాలో అణువణువు తనిఖీలు చేస్తున్న ఐడీఎఫ్‌ దళాలు.. హమాస్‌ స్థావరాలను బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా ఓ కిండర్‌గార్డెన్‌, ఎలిమెంటరీ స్కూల్‌లో ఇజ్రాయెల్‌ బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలను గుర్తించాయి. మోర్టార్‌ షెల్స్‌, రాకెట్ ప్రొపెల్ల్‌డ్‌ గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలను హమాస్‌ ఈ స్కూళ్లలో భద్రపర్చినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.