Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక ఆఫర్.. ప్రపంచకప్ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. హెలికాప్టర్‌లోంచి మ్యాచ్‌ చూసేందుకు ఆహ్వానం..!

ప్రపంచకప్‌ మ్యాచ్‌కు సంబంధించి తాజాగా ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 'హెలికాప్టర్‌లో ప్రపంచ కప్ ఫైనల్‌ను చూడటానికి ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నారా? నాకు ఇద్దరు వ్యక్తులు కావాలి. శనివారం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి అహ్మదాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి మ్యాచ్‌ని వీక్షించి తిరిగి వస్తాం... అంటూ చేసిన పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమ్ ఇండియా తన ఫైనల్ మ్యాచ్‌లోనూ దిగ్విజయంగా నిలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.

ICC World Cup 2023: క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక ఆఫర్.. ప్రపంచకప్ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. హెలికాప్టర్‌లోంచి మ్యాచ్‌ చూసేందుకు ఆహ్వానం..!
ICC World Cup 2023
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 18, 2023 | 1:12 PM

ICC ప్రపంచ కప్: ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 చివరి మ్యాచ్ నవంబర్ 19 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేధికగా.. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. టిక్కెట్లు దొరికినా, దొరక్కపోయినా సరే.. లైవ్ మ్యాచ్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్సవ్వకూడదన్న ఉత్కంఠ క్రికెట్ ప్రియుల్లో నెలకొంది. ప్రపంచకప్‌ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల ధర, కొరతకు సంబంధించిన మీమ్స్‌, పోస్ట్‌లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. @ayushpranav3 అనే ట్విటర్ ఐడీ ఉన్న వ్యక్తి తనతో హెలికాప్టర్‌లో అహ్మదాబాద్ చేరుకుని స్టేడియంలో మ్యాచ్ వీక్షించాలని ప్రజలను ఆహ్వానించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. క్యాప్షన్‌లో అతడు..ఇలా వ్రాశాడు- ‘హెలికాప్టర్‌లో ప్రపంచ కప్ ఫైనల్‌ను చూడటానికి ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నారా? నాకు ఇద్దరు వ్యక్తులు కావాలి. శనివారం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి అహ్మదాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి మ్యాచ్‌ని వీక్షించి తిరిగి వస్తాం… అంటూ చేసిన పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకర్షించింది. అసలు విషయంలోకి వెళితే…

ఈ పోస్ట్ చదివి ప్రజలు సంతోషించి రిప్లై ఇచ్చే లోపుగానే.. అందరికీ బిస్కెట్‌ పడింది..పోస్ట్‌ కింద రాసిన లైన్ అందరినీ నవ్వుకునేలా చేసింది. మీకు ఆసక్తి ఉంటే, దయచేసి మెసేజ్ చేయండి. కానీ, మీకు హెలికాప్టర్, టికెట్ ఉండాలి లేకపోతే మనం వెళ్ళలేము అంటూ రాశాడు. దీంతో అందరి ఆరాటం బెలూన్‌లోంచి గాలి వెళ్లిపోయినట్టుగానే తుస్సుమంది..క్రికెట్‌ ప్రియులను ఊరించి ఊసురు మనిపించిన ఈ పోస్ట్‌పై ప్రజలు అనేక వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు – బ్రదర్, నేను హెలికాప్టర్, టిక్కెట్లు తీసుకువస్తాను, మీరు నాకు పార్కింగ్ స్థలం ఇవ్వండి అంటూ ఒకరు కామెంట్‌ చేయగా,… ఇంకొకరు ఎంజాయ్ చేస్తూ రాసారు – బ్రదర్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

నవంబర్ 19న 2023 వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. 1 లక్షా 32 వేల మంది ప్రేక్షకుల మధ్య భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేరుగా తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే టీమిండియా అహ్మదాబాద్‌కు చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమ్ ఇండియా తన ఫైనల్ మ్యాచ్‌లోనూ దిగ్విజయంగా నిలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి