Viral Video: పిచ్చి పలురకాలు.. ఎన్నికల్లో గెలుపుకోసం ఫకీరుతో చెప్పుదెబ్బలు తిన్న అభ్యర్థి.. నెట్టింట్లో వీడియో వైరల్
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లి చెప్పులతో కొట్టించుకుని ఆశీర్వాదం పొందారు.
ప్రతి వ్యక్తికీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే రాజకీయనాయకులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు చేసే పనులు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలో గెలుపు కోసం తమ ఇష్టదైవాలను, బాబాలను దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక్కసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ సమయంలో ఏదైనా స్పెషల్ రీజన్ ఉందని గమనిస్తే.. దానిని వారు అదే సెంటిమెంట్‌గా ఫాలో అవుతుంటారు. తాజాగా ఓ రాజకీయ నాయకుడికి సెంటిమెంట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లి చెప్పులతో కొట్టించుకుని ఆశీర్వాదం పొందారు.
బాబాను సందర్శించుకున్న తర్వాత పరాస్ సాక్లేచా కొత్త చెప్పులను సమర్పించారు. వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై టపటపా బాదేసాడు. ఆ తర్వాత చెప్పులతో రెండు చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేశారట. అయితే చెప్పు దెబ్బలకు ఏమాత్రం ఓట్లు రాలతాయో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
रतलाम कांग्रेस पार्टी प्रत्याशी पारस सकलेचा। चुनाव जीतने के लिए चप्पल का प्रसाद 🤭 कांग्रेस ही ये कर सकती है। 🤣@AlokTiwari9335 😁 pic.twitter.com/RaqdtNESkN
— Deepak Lahiri ✍️ (@DeepakLahiri5) November 17, 2023
సక్లేచా గతంలో 2008లో రత్లాం అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 2013లో ఓటమిని ఎదుర్కొని మూడో స్థానంలో నిలిచారు. కశ్యప్ 2018లో విజయం సాధించారు. ఇప్పుడు వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో నిలబడ్డారు. బీజేపీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే చేతన్ కశ్యప్ పై పోటీ పడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..