AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వీడో మహా మాయగాడు.. ఏటీఎం నుంచి డబ్బులు రావడం లేదని పక్కనున్న వ్యక్తికి కార్డ్ ఇస్తే ఏం చేశాడంటే..

కళ్ళ ముందే కనికట్టు చేశాడు ఆ దొంగ.. ఏటీఎంలో డబ్బులు రావడం లేదని.. పక్కనున్న వ్యక్తికి ఏటీఎం కార్డ్ ఇస్తే డబ్బులు డ్రా చేసి తీసుకుని వెళ్ళాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏటిఎంలో మహిళ కళ్ళుగప్పి ఏటీఎం తీసుకుని 25 వేల రూపాయిల నగదు డ్రా చేసి తీసికెళ్లాడు దుండగుడు. 

Andhra Pradesh: వీడో మహా మాయగాడు.. ఏటీఎం నుంచి డబ్బులు రావడం లేదని పక్కనున్న వ్యక్తికి కార్డ్ ఇస్తే ఏం చేశాడంటే..
Atm Chori
Nalluri Naresh
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 11:34 AM

Share

అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో ఆంధ్రా ప్రగతి గ్రామీణ ప్రగతి బ్యాంక్(APGPB) ఏటీఎంలో మునీంద్ర అనే మహిళ ఏటీఎం కార్డును ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి 25వేల రూపాయల నగదును అపహరించాడు. మోసానికి గురి అయినటు వంటి మహిళ విషయం తెలుసుకొని గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏటీఎం కార్డు ఉపయోగించడం రానటు వంటి మహిళ డబ్బులు రావడం లేదని పక్కన ఉన్న వ్యక్తికి చూపించి డబ్బులు డ్రా చేసి ఇవ్వమని అడిగింది.

ఆ అపరిచితుడు రెండు మూడుసార్లు ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి ఇది పనిచేయడం లేదని చెబుతూ మాటల్లో పెట్టాడు. జాగ్రత్తగా తన దగ్గర ఉన్న మరో ఏటీఎం కార్డును తీసి ఆమెకి ఇచ్చాడు. ఆ యువకుడి ఆలోచన తెలియని ఆ మహిళ ఆ యువకుడు ఇచ్చిన ఏటీఎం కార్డుని తీసుకుని వెళ్ళిపోయింది.

ఇవి కూడా చదవండి

ఆమె వెళ్లిపోయిన తర్వాత దుండగుడు ఏటీఎం కార్డుతో 25 వేల రూపాయలను డ్రా చేసుకొని పరార్ అయ్యాడు. బాధితురాలు గుత్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలో మహిళను మోసం చేసి.. కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు